Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డిపై రౌడీషీటర్లు హత్యకు కుట్ర జరుగుతుందని తెలియడంతో రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే జగదీష్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉండగా రికార్డు చేసుకున్న వీడియో పోలీసులకు చేరింది. ఈ వీడియో బిగ్ టీవీ చేతికి చిక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో పోలీసులకు 5రోజుల క్రితమే అందిందని సమాచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా పెరోల్ మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎవరైతే లేడీ డాన్ అని పేరు పొందిన అరుణ ఉన్నారో ప్రస్తుతం అరెస్ట్ అయి జైల్లో ఉంది. అరుణ మాట్లాడిన మాటలు కూడా వారంతో రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో నానా హల్‌చల్ చేశారు. ఒక బడానేత తనవైపు ఉన్నారని, తనకు పెరోల్‌కి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని చెప్పకొచ్చింది. పోలీసుల అదుపులో వున్న అరుణ బడానేత అంటూ ప్రస్తావించిందో ఆ బడానేత శిష్యులే.. జగదీష్, శ్రీకాంత్ ఉన్నారని కీలక సమాచారం. ఆ బడానేతనే శ్రీకాంత్ పెరోల్ మీద విడుదల కావడానికి లెటర్ కూడా ఇచ్చారని వారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ ముగ్గరు కూడా ఆ బడానేత మాకు దేవుడని చెప్పడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.
Also Read: Bhupalapally News: క్షుద్రపూజలకు యువతి బలి? భూపాలపల్లిలో షాకింగ్ ఘటన
వీరంతా విపరీతంగా మద్యం సేవించి, ఆ తరువాతే ఈ హత్యా కుట్ర గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రౌడీషీటర్లు జగదీష్, మహేష్‌తో పాటుగా వినీత్, మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ వీడియోలో కనిపించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజకీ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, వైఎస్ వివేకా హత్య తరహాలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అంతమొందించాలని ప్లాన్ వేసినట్లు చర్చలు సాగుతున్నాయి.
ఈ సదరు వీడియో విషయమై పోలీసులకు ఐదురోజుల క్రితమే సమాచారం అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల టీడీపీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు స్పందించకపోవడంపై విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఒక టికెట్ ఇస్తామని రాజకీయ పెద్దలు హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం వెలువడింది. అంతేకాకుండా, హత్య జరిగితే డబ్బులు కురిపిస్తామని ఈ వీడియోలో స్పష్టమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.