Rushikonda Palace: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పైనే గడిచిపోయింది. మరి రుషికొండ ప్యాలెస్ మాటేంటి? అద్దెకు ఇచ్చే ఆలోచన ఉందా? ఎవరూ ముందుకురావడం లేదా? ఈ ప్యాలెస్‌ని ఏంచెయ్యబోతున్నారు? అద్దెకు ఇస్తే కనీసం విద్యుత్ ఛార్జీ వస్తుందని అంటున్నారు. శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు.
విశాఖ రుషికొండలో జగన్ నిర్మించిన మాయామహల్‌ని కూటమి ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది? స్టార్ హోటళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందా? దీన్ని ఎవరికి అప్పగించాలో తెలియక తర్జనభర్జన పడుతుందా? పదే పదే కూటమి నేతలు సందర్శించడం వెనుక అసలు కథేంటి? అన్నదే అసలు ప్రశ్న.
మూడురోజుల క్యాంప్ నేపథ్యంలో విశాఖలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ని సందర్శించారు. ఆ ప్యాలెస్‌ని చూసి ఆ పార్టీ నేతలు షాకయ్యారు. అందులో ఒక్కోదాని ధర గురించి చెబుతుంటే విని సైలెంట్ అయిపోయారు. నోటి వెంట మాట రాలేదు.
రుషికొండ ప్యాలెస్ గురించి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అనుమతులకు మించి కొండను తవ్వారని, దీనివల్ల పర్యావరణం పూర్తి దెబ్బతిందన్నారు. ఆదాయాన్ని సమకూర్చేలా ఈ భవనాలను ఉపయోగించాలన్నారు. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోతుందన్నారు.
ALSO READ: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు
ఒకప్పుడు ఏడాదికి 7 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేందన్నారు. రుషికొండపై వచ్చే కోటి రూపాయల ఆదాయం కేవలం కరెంటుకే వెచ్చించి స్థితికి తెచ్చారన్నారు. నెలకు కరెంటు, నిర్వహణ బిల్లులు కలిసి దాదాపు 70 లక్షలు అవుతున్నట్లు తెలుస్తోంది.
నిర్మాణాల సమయంలో జీవీఎంసీ, టూరిజం విభాగాల్లో అవినీతి జరిగినట్టు అంచనాకు వచ్చారు. దానిపై విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చినా, ప్రభుత్వం ఆదీనంలో ఉండాలన్నారు. 10 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారని, అందులోని మూడు భవనాలు అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగించుకోవచ్చన్నారు.
మరో నాలుగు భవనాలు ఎందుకు నిర్మాణం చేపట్టారో తెలీదన్నారు. దీన్ని టూరిజం శాఖకు అప్పగించిస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్, సెమినార్, ప్రభుత్వ సమిట్‌లను అక్కడ చేస్తే బాగుంటుందని రివ్యూ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం అన్నట్లు సమాచారం.
తొలుత రూ. 164 కోట్లతో ఈ భవనాలను నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చివరకు మూడు భవనాలకు రూ. 450 కోట్లు అయ్యిందన్నారు. ఈ పర్యటన వల్ల ఏం చేయ్యాలని అనేదానిపై చర్చించనున్నారు. తొలుత ఆయా భవనాల్లో సేఫ్టీ ఆడిటింగ్ నిర్వాహించాలని అనుకున్నట్లు తెలిపారు.
రుషికొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఎమ్మెల్యేలతో కలిసి గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ pic.twitter.com/8eIXk2LEFg
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2025