OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలోనే సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో నటించిన ఓజీ సినిమా(OG Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా, ఈ రెండు పాటలు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కానీ ఇతర అప్డేట్స్ కానీ చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తారని స్పష్టమవుతుంది.
పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టిల్లు బ్యూటీ?
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే .అలాగే సీనియర్ నటి శ్రియ రెడ్డి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty)కూడా క్యామియో పాత్రలో నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఇది మాత్రం ప్రేక్షకులకు ఒక సర్ప్రైజింగ్ అనే తెలుస్తోంది.
స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనున్న నేహా శెట్టి?
ఇకపోతే నేహా శెట్టి ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటిస్తున్నారా లేకుంటే ఏదైనా స్పెషల్ సాంగ్లో సందడి చేయబోతున్నారా అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసమే నేహా శెట్టిని మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ కు జోడిగా స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఇక నేహా శెట్టి డిజె టిల్లు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఓజీ పైనే ఆశలు…
ఇటీవల ఈమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది . ఇక పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇటీవల హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందని చెప్పాలి. ప్రస్తుతం మెగా అభిమానుల ఆశలన్నీ కూడా ఓజీ సినిమా పైన ఉన్నాయి .
Also Read: Janhvi Kapoor: నా పెళ్లి అయిపోయింది.. అతనే నా భర్త అంటున్న జాన్వీ కపూర్