Ex cm ys Jagan described Budmeru with river..public trolling: రాజకీయ నాయకులు అంటే ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసుండి ఉండాలి. అలాగే తాము మాట్లాడే టప్పుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త ముందు వెనకా చూసుకుని మాట్లాడాలి. పాపం అధికారంలోకి లేకపోయేసరికి ఏపీలో వైఎస్ జగన్ తాను ఎదుటివారిని విమర్శించాలని అనుకుని తానే విమర్శలపాలవుతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు విపత్తు జాతీయ విపత్తే. ముఖ్యమంత్రి కాదు కదా ఆ స్థానంలో అమెరికా అధ్యక్షుడు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. వరద ప్రాంతాలను సకాలంలో పర్యటించి వరద ప్రాంతంలోనే దగ్గరుండి పర్యవేక్షించారు చంద్రబాబు నాయుడు. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ కూడా పర్యటించారు. అక్కడి దాకా బాగానే ఉంది. కొన్ని సందర్భాలలో విమర్శించడమ పనిగా పెట్టుకుని..వరదల్లో బురద రాజకీయాలకు తెరతీస్తున్నారు జగన్. ఏమయ్యారు జగన్ అభిమానులు. పదవి లేకపోయేసరికి అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా వైఎస్ జగన్ వర్గీయుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. జగన్ కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించడం లేదు. చిల్లర రాజకీయాలకు తెరతీస్తున్నారు.
బాబును విమర్శించడమే పనిగా..
చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకుని కావాలని వరదల్లో కూడా రాజకీయాలు చేస్తూ ఒక్కో సందర్భంలో ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న విజయవాడ వరదలను మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ గా అభివర్ణించిన జగన్ పై జనం మామూలుగా ట్రోలింగ్స్ చెయ్యలేదు. అది మర్చిపోక ముందే లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు కావాలనే తన ఇంటిని వరద నీటినుండి కాపాడుకోవడానికి బుడమేరు లాకులు ఎత్తేసి విజయవాడ ముంపుకు కారణమయ్యాడని విమర్శిస్తున్నారు. పైగా బుడమేరు ను నదిగా సంభోధించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుడమేరు అనే పేరులోనే ఏరు అని ఉంది..అదేమన్నా కృష్ణానది లాంటిది అనుకున్నారా జగన్ అంటూ జనం నవ్వుకుంటున్నారు.
అవగాహన లేకుండా..
అయినా ఓ రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తికి ఏరుకు, నదికి తేడా తెలియదా అంటున్నారు. ఎక్కడికైనా పబ్లిక్ లో రావాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంపై అవగాహన కలిగివుండాలని..ఏ మాత్రం ప్రిపేర్ కాని విద్యార్థి పబ్లిక్ పరీక్షలకు హాజరైన చందాన జగన్ ఇలా బుడమేరు గురించి ఇష్టారీతిలో మాట్లాడటం తగదని అంటున్నారు పబ్లిక్. అసలు జగన్ కు బుడమేరు గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకోష్ మంగళ గిరిని మందల గిరిగా సంభోదిస్తే వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. దానిపై వీడియోలు ట్రోలింగులు చేశాయి. ఇక మాజీ మంత్రి రోజా అయితే లోకేష్ ని ఓ ఆట ఆడేసుకున్నారు. దానికి కౌంటర్ గా ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కూడా జగన్ పై విరుచుకుపడుతూ ట్రోలింగులు చేస్తూ మండిపడుతున్నారు.
వైసీపీ కార్యకర్తలెక్కడ?
రాజకీయ నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. ఎక్కడైనా పూర్తి అవగాహనతోనే మాట్లాడాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. పబ్లిక్ లో దొరికిపోతే పరువు పోయినట్లే. తనకు మాత్రమే అన్నీ తెలుసనే భావనతో వెళితే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని..కనీసం పార్టీలో ఎవరైనా అనుభవజ్ణులతో చర్చించి బుడమేరు విషయంలో మాట్లాడాలని అంటున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు వరద నివారణ పనులు చేపట్టడంలో వెనకబడ్డారని విమర్శిస్తున్నారు. ముందు పార్టీ శ్రేణులను అందుకు సమాయాత్తం చేయించుకోవాలని..అవన్నీ చేతకాక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం భావ్యం కాదని అంటున్నారు.