Janhvi Kapoor: అందాల తార అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి(Sridevi) తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్ బిజీ అవుతున్న నేపథ్యంలో శ్రీదేవి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నా జాన్వీ కపూర్ వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక గత కొంతకాలంగా ఈమె ప్రేమ వ్యవహారం గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
శిఖర్ పహారియాతో ప్రేమాయణం…
జాన్వీ కపూర్ శిఖర్ పహారియా (Shikar Pahariya)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా కలిసి వెళుతుంటారు. అయితే తాజాగా జాన్వీ కపూర్ పరమ సుందరి (Parama Sundari)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జాన్వీ తనకు పెళ్లి అయిపోయిందనే విషయాన్ని తెలియజేయడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఈమెకు పెళ్లి కావడం ఏంటి, ఎప్పుడు చేసుకుంది ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
వెయిటర్ల టార్చర్ తట్టుకోలేక..
జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంది అంటే నిజంగా కాదండోయ్.. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసమే తనకు పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పినట్లు తాజాగా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.. తనకు పెళ్లి జరిగింది అంటూ చాలాసార్లు అబద్ధం చెప్పానని ఈమె వెల్లడించారు. అయితే ఇండియాలో కాదని అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు కొంతమంది వెయిటర్లు నన్ను చూడగానే వారి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. అలాగే నేను ఏది ఆర్డర్ చేయకుండానే కొన్ని వంటకాలు తెచ్చి నా ముందు పెట్టేవారు.
తిరుపతిలోనే పెళ్లి…
ఇలా ఓసారి తాను ఓ రెస్టారెంట్ కు ఓరి(Orry)తో కలిసి వెళ్లాను. ఆ సమయంలో నేను అక్కడున్న వారందరికీ తనని నా భర్త అంటూ పరిచయం చేశానని ఈ సందర్భంగా లాస్ ఏంజెల్స్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక జాన్వీ కపూర్ తరచూ తన పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంటారు. తన పెళ్లి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా సాంప్రదాయ బద్ధంగా జరుగుతుందని ,మూడు రోజులు పాటు తన పెళ్లి చేసుకోవాలని, ఈ పెళ్లిలో తాను కాంజీవరం పట్టుచీరను ధరించాలి, అరటి ఆకులు భోజనం చేయాలి అంటూ పెళ్లి గురించి తన కోరికలను గతంలో పలు సందర్భాలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి కంటే కూడా కెరియర్ పై ఫోకస్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవర సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో(Peddi Movie) నటిస్తున్నారు.
Also Read: Sunny Leone: సన్నీకి ప్రెగ్నెన్సీ అస్సలు వద్దు… కానీ పిల్లలు కావాలంట… అందుకే అలా!