E-Paper
Advertisement

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..
Advertisement

AP Assembly : ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం రేగింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులపై మరోసారి వేటు పడింది. 14 మందిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఈ చర్యలు తీసుకున్నారు.

ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టగానే టీడీపీ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. బడ్జెట్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు. దీంతో బుగ్గన కాసేపు బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ తన సీటు నుంచి లేచి మాట్లాడారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట ప్రజలు చూస్తున్నారని టీడీపీ సభ్యులకు గట్టిగా చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదని హితవు పలికారు.

Advertisement

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్‌ చేయాలని స్పీకర్‌ సూచించారు. అయినా సరే బడ్జెట్‌ ప్రసంగానికి పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్ చేశారు.

బుధవారం కూడా 12 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారితోపాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. అయినాసరే సభలో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

Advertisement

ICC: అశ్విన్‌ టాప్.. కోహ్లీ బెటర్.. ఐసీసీ ర్యాంకుల్లో మనోళ్ల హవా..

Pawan Kalyan: జనసేనానికి జగన్ భయపడ్డారా? ‘వారాహి’ యాత్ర, సభ సక్సెస్ అందుకేనా?

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×