Tirumala Adulterated Ghee case: వైసీపీలో కీలక నేతలకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వివిధ కేసుల్లో ఒకరు తర్వాత మరొకరు విచారణలకు హాజరవుతున్నాయి. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పిలుపు వచ్చింది. ఈనెల 13న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసుల విషయం తెలియగానే కొందరు వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు వైసీపీలో టెన్షన్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన పలు కంపెనీల ప్రతినిధులను సీబీఐ సిట్ విచారణ చేసింది. ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల వంతైంది. ఆనాడు టీటీడీలో కీలక పదవులు నిర్వహించిన వారికి నోటీసులు ఇస్తోంది. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులను విచారించింది.
అలిపిరి వద్దనున్న సిట్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం హాజరు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి. సేకరించిన వివరాలు దగ్గర పెట్టి మరీ ప్రశ్నలు రైజ్ చేశారు దర్యాప్తు అధికారులు. నెయ్యి సరఫరా వ్యవహారం ఆయా కంపెనీలకు ఎలా అప్పగించారు? ఒకవేళ నెయ్యి సరఫరా విషయంలో పాలక మండలి నిర్ణయం తీసుకున్నా, మీరెందుకు వ్యతిరేకించలేదు.
గురువారం విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపు
దీనివల్ల మీకొచ్చిన ప్రతిఫలం ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు సంధించినట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం కల్తీ నెయ్యి కోనుగోలు వ్యవహారంపై ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వంతైంది. నవంబర్ 13న విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. అధికారుల ప్రశ్నలకు ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.
ఈ కేసును సీబీఐ డీఐజీ మురళి లాంబా ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. వైవీ ఇచ్చిన సమాధానాల బట్టి ఇస్తే అప్పటి ప్రభుత్వ పాలకుల ప్రమేయం ఉంటే వారిని పిలిపించే అవకాశముంది. ముఖ్యంగా ఆనాటి దేవాదాయశాఖ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్స్ ప్యాకెట్లు
ఈ కేసులో ఇప్పటికే 24 మందిపై కేసు నమోదు చేసింది సీబీఐ సిట్. ప్రస్తుతం తొమ్మిది మంది అరెస్ట్ చేసింది. మరికొందర్ని అరెస్టు చేసే అవకాశముంది. ఈ వ్యవహారంపై వైసీపీలో దుమారం రేగుతోంది. గత ప్రభుత్వం హయాంలో భోలేబాబా డెయిరీ.. టీటీడీకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపినట్లు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ నిర్ధారించింది.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ వంటి రసాయనాలు వినియోగించారని వెల్లడించింది. కల్తీ నెయ్యిలో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి సమీపంలోని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా భోలేబాబా కంపెనీ పంపినట్టు బయటపడిన విషయం తెల్సిందే.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు
ఈ నెల 13న విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు pic.twitter.com/IWPp0bqc2l
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణకు హాజరైన టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి..
సీబీఐ డీఐజీ మురళి లాంబా ఆధ్వర్యంలో విచారణ
ఇప్పటికే ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు
తొమ్మిది మంది అరెస్ట్
నవంబర్ 13న సిట్ విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు pic.twitter.com/VtdRr4lr9A
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025