BigTV English
Advertisement

Ear Wax Removal: ఆగండి ఆగండి.. అదేపనిగా చెవిలో వాటిని పెట్టి తిప్పుతున్నారా?

Ear Wax Removal: ఆగండి ఆగండి.. అదేపనిగా చెవిలో వాటిని పెట్టి తిప్పుతున్నారా?

Ear Wax Removal: మనలో చాలామంది చీటికీమాటికీ చెవిలో కాటన్ ఇయర్ బడ్స్ లేదా పిన్నీసులను చెవిలోకి చొప్పించి గుమిలి తీస్తుంటారు. కానీ, ఇది మంచి పద్ధతికాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటు.. జ్ఞానేంద్రియాల్లో చెవికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గుమిలి చెవి బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులు లోపలికి పోకుండా స్రవిస్తుంది. కాబట్టి.. అదేపనిగా చెవిలో గుమిలి తీయాల్సిన పనిలేదు. కొందరు కనీసం వారానికి ఒకసారైనా ఇలా కాటన్ ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేసుకుంటుంటారు. ఇలా చెవులను క్లీన్ చేసుకోవడంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..


ఇది నిజం కాదు:

చెవిలోని గుమిలి క్లీన్ చేస్తేనే.. చెవులు శుభ్రంగా ఉంటాయని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. చాలామందికి దానంతటదే బయటకు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెవి మార్గంలోని ప్రత్యేక చర్మం గులిమిని బయటకు తోస్తూ, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుందట. కాబట్టి ప్రత్యుకంగా గుమిలి తీయాల్సిన పనిలేదని సూచిస్తున్నారు. ఈ గుమిలి అనేది చెవి మార్గం ముందుభాగంలోని వెంట్రుకలు, సెబేషియస్ గ్రంథుల నుంచి వెలువడే స్రావాలతో తయారవుతుంది కాబట్టి.. ఇది లోపలి భాగాన్ని తడిగా ఉంచుతూ, మార్గం ఎండిపోకుండా చూస్తుంది. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, క్రిముల వంటివి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే.. చెవికి సహజ రక్షణ కవచంగా నిలుస్తుందని నిపుణులు చెబేతున్నారు.

ప్రత్యేకించి తీయాల్సిన పనిలేదు:

కొంతమందికి చెవిలో గులిమి ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో ఇది చాలా జిగురుగా, మరికొందరికి గట్టిగా ఉండొచ్చట. ఏదేమైనా దీన్ని ప్రత్యేకించి తీయాల్సిన అవసరం లేదట. అగ్గిపుల్లలు, పిన్నీసులు, కాటన్ బడ్స్ వంటివి చెవిలో పెట్టి తిప్పితే గులిమి ఇంకా లోపలికి పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దీంతో చెవిలోని చర్మం, కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.


తీవ్రమైన నొప్పి రావచ్చు:

చాలా తక్కువ మందిలో చెవిలో గులిమి లోపల పోగవ్వచ్చని, వీరిలో 1-2 శాతం మందికి గట్టిపడి, చెవి మార్గం నిండిపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారికే గులిమి తీయాల్సి వస్తుందని, అదీ కూడా ఈఎన్​టీ నిపుణులతోనే తీయించుకోవాలని సూచిస్తున్నారు. మీకు మీరుగా చేసుకునే సొంత వైద్యం వల్ల కొన్నిసార్లు కర్ణభేరి దెబ్బతినొచ్చు. ఒకవేళ అప్పటికే కర్ణభేరికి రంధ్రం ఉన్నట్టయితే, హానికారకాలు చెవిలో ప్రవేశించి ఇన్​ఫెక్షన్​, నొప్పి, చీము కారటం వంటివి తలెత్తే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

Body Spray: సువాసన సరే గానీ సమస్యల సంగతేంటి?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

Apple Benefits: పడుకునే ముందు ఆపిల్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Water: పడుకునే ముందు నీరు తాగడం వల్ల కలిగే.. అద్భుత ప్రయోజనాలివే !

Pattu Saree: అమ్మాయిల నుంచి అమ్మల వరకు అందరికీ ఇష్టమే.. మెరుపు, మన్నిక తగ్గకూడదంటే?

Hair Fall In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? అయితే ఈ టిప్ప్ ఫాలో అవ్వండి

Dog Bite Precautions: విశ్వాసం విషం కావద్దొంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్న నిపుణులు!

Worst Food For Liver: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే.. మీ కాలేయాన్ని కాపాడుకున్నట్లే !

Big Stories

×