Peddi Second Single: రామ్ చరణ్ (Ramcharan)హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా ఒకవైపు షూటింగ్ పనులను జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. “చికిరి చికిరి”(Chikiri Chikiri) అంటూ సాగిపోయే ఈ పాట విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.
ఇక ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్ హుక్ స్టెప్స్ కు విపరీతంగా రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పెద్ది సినిమా నుంచి సెకండ్ అప్డేట్ గా విడుదలైన ఈ పాటకు భారీ ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు అయితే డిసెంబర్ 31వ తేదీ ఈ పాటను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక సెకండ్ సింగిల్ లో భాగంగా ఈ సినిమాలో హీరో రామ్ పాత్ర గురించి తెలియజేయబోతున్నారని స్పష్టమవుతుంది. ఇలా పెద్ది సినిమా నుంచి మరొక అప్డేట్ రాబోతోందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సెకండ్ సింగిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన చిత్ర బృందం వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ కామెంటేటర్ గా జాన్వీ…
ఈ సినిమాలో జాన్వీ క్రికెట్ కామెంటేటర్ గా అచ్చియమ్మా అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు మైత్రి మూవీ మేకర్స్ తో పెద్ది సినిమాకు కమిట్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమా తరువాత రాబోతున్న చిత్రం పెద్ది కావడంతో అభిమానుల ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి.
Also Read: Jackie Chan: జాకీ చాన్ మరణం పై వార్తలు.. బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా!