BigTV English
Advertisement

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

1. విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమిట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో ప్రధాన వేదికతో సహా ప్రాంగణం మొత్తాన్ని జల్లెడ పడుతోంది బాంబ్ స్క్వాడ్‌. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు అవుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.


2. అందె శ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ హాజరు

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్‌ మోశారు.

3. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 32శాతం లోపే ఓటింగ్‌ శాతం నమోదైంది. ఇవాళ దేశ వ్యాప్తంగా ఇదే సమయానికి 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా అత్యల్ప పోలింగ్‌ శాతం మాత్రం జూబ్లీహిల్స్‌లోనే నమోదైంది. ఇందుకు కారణం యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపకపోవడమే. ఇక మిగిలి ఉన్న సమయంలో అయినా పోలింగ్‌ శాతం పెరుగుతుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది


4. ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీ కొట్టి.. ముగ్గురు మృతి

నెల్లూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. NTR నగర్‌ దగ్గర జాతీయ రహదారిపై ప్రయాణించిన లారీ అదుపుతప్పి ఓ ఆటోను, కొన్ని బైక్‌లను ఢీకొట్టి… ఆ తర్వాత రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్న వ్యక్తిపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

5. లక్ష దీపోత్సవ వేడుకలో పంతం కొండలరావు

తూర్పు గోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్‌లో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ వేడుకలో ట్రస్ట్ ఛైర్మన్ పంతం కొండలరావు పాల్గొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల కోసం కోటిలింగాల ఘాట్‌ను అభివృద్ధి.. శాశ్వత వేదిక, ర్యాంప్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

6. మాజీ సీఎం జగన్ పై మంత్రి రామానాయుడు సంచలన వ్యాఖ్యలు

మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ విరుచుకుపడ్డారు. జగన్‌పై పారిశ్రామికవేత్తలు అవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమలకు భరోసా ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.

7. తిరుపతి పరకామణి కేసు.. రాజకీయ ఒత్తిడి

తిరుపతి పరకామణి కేసులో విజివో డీఎస్పీ గిరిధర్, సీఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను సీఐడీ ప్రశ్నించింది. దొరికింది 12 నోట్లయితే, తొమ్మిగ చూపడం, డాలర్ విలువ పెంచడంపై సీఐడీ ఆరా తీసింది. రవికుమార్‌తో సంబంధాలు, రాజకీయ ఒత్తిడిపై విచారణ జరిగింది.

8. విద్యుత్ షాక్ తగిలి హోటల్ యజమాని మృతి

రామాయంపేటలో విద్యుత్ షాక్ తగిలి హోటల్ యజమాని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. లాలా గౌడ్ అనే వ్యక్తి తన హోటల్ వద్ద సామాగ్రి సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా హోటల్ యజమాని లాలా గౌడ్ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

9. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై హత్యా ప్రయత్నం

తిరుపతి జిల్లా పుత్తూరు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై హత్యా ప్రయత్నం జరిగింది. విడాకుల కేసులో తన భార్య తరఫున వాదిస్తున్న న్యాయవాది రాజశేఖర్‌ను ఆమె భర్త సాయిప్రసాద్ రెడ్డి కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. న్యాయవాది ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఇన్‌స్పెక్టర్ విచారించి14 రోజులు రిమాండ్‌కు పంపారు.

10. చీరాలలో కేంద్ర బృందం పర్యటన

బాపట్ల జిల్లా చీరాలలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. వాడరేవు, రామాపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పరిశీలించి.. జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావంతో చీరాలలో జరిగిన నష్ట తీవ్రతను కలెక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. డ్యామేజ్ అయిన రోడ్లు, కల్వర్టులపై చూసిన సభ్యుల పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

11. 8వ తరగతి విద్యార్థిపై పాఠశాల యాజమాన్యం వివక్ష

కృష్ణా జిల్లా మచిలీపట్నం నిర్మల పాఠశాల యాజమాన్యం 8వ తరగతి విద్యార్థిపై వివక్ష చూపింది. అయ్యప్ప స్వామి మాల ధరించి రావద్దని, తరగతి గది నుంచి విద్యార్థిని బయటకు పంపించారు. మతపరమైన తాడులు కూడా ధరించరాదని ఆంక్షలు విధించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

12. DIG పై విచారణ జరపాలి

దళిత మహిళపై టీడీపీ మీడియా టార్గెట్‌ను ఖండించారు బై బీమ్ రావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. సుధా మాధవి ఇచ్చిన ఫైల్‌పై చంద్రబాబు ఫాలో అప్ లేకపోవడం డ్రామానేనా అని ప్రశ్నించారు. 7 కోట్లు తీసుకున్న వేమన సతీష్, DIG కోయా ప్రవీణ్‌పై విచారణ జరిపి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

13. ఐదవ తరగతి బాలిక కిడ్నాప్ కలకలం అప్‌డేట్

అమలాపురంలో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక కముజు నిషిత ఆచూకీ లభించింది. సీఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించగా ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెం వద్ద బాలికను కనుగొన్నారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ కలిసి బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు

14. వైరల్ గా మారిన భీమవరం నిందితుడు శ్రీనివాస్ వీడియో

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అయింది. తన తల్లి, తమ్ముడు దెయ్యాల ని చెబుతున్నాడు. మనస్సులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతోందంటున్నాడు. అందుకే ఇద్దరిని చంపేశానని తెలిపాడు నిందితుడు.

15. రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందన్నారు మంత్రి, డీసీఎం డీకే శివకుమార్‌. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జలవనరుల కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదన్నారు.

16. రామ్‌చరణ్ పై రామ్‌గోపాల్ వర్మ కామెంట్స్

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, రామ్‌చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది పాటను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టారు. చాలకాలం తర్వాత మళ్లీ ఆయనలో హై ఓల్టేజీని చూశానని అన్నారు. చికిరి సాంగ్‌లో రామ్‌చరణ్ రా లుక్‌లో ఎనర్జిటిక్‌గా కనిపించాడని తెలిపారు ఆర్జీవి. ఆ పాట లింక్‌ని సైతం ఆయన పోస్ట్ చేశారు.

17. చైన్నై సూపర్‌కింగ్స్‌లో సంజు శాంసన్

సంజు శాంసన్‌ను చెన్నై సుపర్‌కింగ్స్ జట్టులోకి తీసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్న వేళ ఓ ఆస్తకిరమైన సంఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా సంజూకు బర్త్ డే విషెస్ చెప్పింది. మోర్ పవర్ టూ యూ, సంజూ.. విషింగ్ యూ ఏ సూపర్ బర్త్‌డే అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో అతడు సీఎస్కేలోకి వస్తాడన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

18. అంగోలా సహకారం అందిస్తాం.. ప్రెసిడెంట్ ముర్ము

భారత్ అంగోలా దేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్నారు. ఈ భాగస్వామ్యం సమానత్వం, పరస్పర విశ్వాసం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్ తన సహకారాన్ని ఆఫ్రికా ప్రాంతంతో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేసిందని ముర్ము పేర్కొన్నారు.

19. ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరిక

హెచ్చదిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

20. భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టగా, ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టు నేతలు మృతి చెందినట్టు సమాచారం.

Related News

Indian Student Dead: అమెరికాలో ఆంధ్రా అమ్మాయి మృతి, అసలు ఏం జరిగిందంటే?

CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Big Stories

×