జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. వెంగళరావు నగర్‌లోని 120 నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. BRS నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో కాంగ్రెస్, BRS కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పక్కా అంటున్నారు ఆయన తండ్రి నవీన్ యాదవ్. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిపై శ్రీశైలం యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి షేక్‌పేట్ డివిజన్‌లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయని.. షేక్‌పేట్ డివిజన్‌లో మైనార్టీ బూత్‌లు ఎక్కువ ఉన్నాయన్నారు. పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు జాతీయ రహదారి పైనుంచి సర్వీస్ రోడ్డులో సుమారు 50 మీటర్ల మేర పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌లోనే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో జరిగిన పేలుడుపై స్పందించారు ఏపీ మాజీ సీఎం జగన్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు
షేక్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. BRS డివిజన్ నాయకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారంటూ పోలీసులపై ఆరోపణలు చేశారు.
అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ మధుసూదన్ రెడ్డిని విజయవాడ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఏపీ, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నిన్న కోటపల్లి మండలంలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 18 హత్యలు, దోపిడీలు, స్మగ్లింగ్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకుడు సుల్తాన్‌తో పాటు అతడి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అంగళ్ళులో జరిగిన షేక్ ఖదీర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలతో సీఐ అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ పాఠశాల వద్ద కండోమ్స్ ప్యాకెట్లు కలకలం రేపింది. పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం రాబట్టారు అధికారులు. రాజేంద్రనగర్‌లో మొయినుద్దీన్‌ను గుజరాత్ ATS బృందం అరెస్టు చేసింది. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర చేస్తున్నట్లు తెలుసుకున్నారు. మొయినుద్దీన్‌తో పాటు మరో నలుగురిని ATS బృందం అరెస్ట్ చేసింది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. రైతులకు చెందిన పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. సుమారు 5 ఎకరాల్లో వరి, అరటి, మామిడి పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా ఇందిరానగర్ రింకొని వాగుసమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడ్డ దొంగకు ఏమీ లభించకపోవడంతో ప్రయత్నం విఫలమైంది.
దిల్లీలోని పేలుడు జరిగిన ప్రాంతం అరుణ్ జైట్లీ మైదానానికి దగ్గరగా ఉండటంతో మైదానం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ గ్రౌండ్‌లో రంజీ ట్రోఫీలో భాగంగా దిల్లీ, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
తమిళనాడు రాష్ట్రం అరియలూర్ జిల్లా వారణవాసి వద్ద సిలిండర్ లారీ ప్రమాదం జరిగింది. లారీ దెబ్బతినడంతో, సిలిండర్లు పగిలి కిలోమీటర్ల దూరం వరకు శబ్దాలు వినిపించాయి. డ్రైవర్ కనగరాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, ఢిల్లీ సీపీ, ఎన్ఐఏ డీజీ హాజరయ్యారు. సమావేశం అనంతరం కశ్మీర్, ఢిల్లీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో.. భద్రతా, నిఘా పెంచండంపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా టీమ్ ఇండియా , సఫారీలతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శుభ్‌మన్ గిల్ భారత జట్టు టెస్ట్ పగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత స్వదేశంలో ఇది రెండో సిరీస్.
ఢిల్లీలో జరిగిన పేలుడులో అనేక మంది అమాయక ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆ ప్రాంతం నుంచి వస్తున్న దృశ్యాలు నిజంగా హృదయ విదారకరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు స్టాలిన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి వార్తను ఆయన కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. తమ ఫ్యామిలీ చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. తండ్రి ధర్మేంద్రకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోం దని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, రామ్‌చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది పాటను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టారు. చాలకాలం తర్వాత మళ్లీ ఆయనలో హై ఓల్టేజీని చూశానని అన్నారు. చికిరి సాంగ్‌లో రామ్‌చరణ్ న్యూ లుక్‌లో ఎనర్జిటిక్‌గా కనిపించాడని తెలిపారు ఆర్జీవి.