CM Chandrababu In Prakasam: మట్టిలో పుట్టిన మాణిక్యాలను సాన పెట్టే బాధ్యతను తాను తీసుకున్నానని అన్నారు సీఎం చంద్రబాబు. ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో కనిగిరిలో దాదాపు ఐదు వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు
మంగళవారం ప్రకాశం జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. కనిగిరిలోని పెద ఈర్లపాడులో ఎంస్‌ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు-శంకుస్థాపనలు చేశారు. బ్రహ్మం గారు చెప్పినట్టు కనిగిరి త్వరలో కనకపట్నంగా మారబోతోందన్నారు.
రిలయన్స్ సంస్థ ప్రపంచంలో రెండో అతి పెద్ద బ్రివరీస్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- స్పీడ్ అఫ్ ఎగ్జిక్యూటింగ్ ది బిజినెస్‌తో సాధ్య మైందన్నారు. ఆలోచనతో వస్తే చాలు పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు, కామన్ ఇన్ఫ్రాను క్రియేట్ చేస్తున్నామని వెల్లడించారు.
త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే
ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నామని, రాజధాని కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. వారిచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి ఇస్తున్నామని, ప్రస్తుతంఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారని, ఈ విషయంలో చాలా కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.
ALSO READ: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. సుబ్బారెడ్డికి సిట్ నుంచి పిలుపు
50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని, అనేక పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కష్టపడి పని చేసే యువత ఏపీకి సొంతమన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారంటూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు.
ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో, కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయి..
బ్రహ్మం గారు చెప్పినట్టు కనిగిరి, త్వరలోనే కనకపట్నం అవుతుంది. #MSMEwaveInAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/dSWzzwuQP4— Telugu Desam Party (@JaiTDP) November 11, 2025