Chittoor District: అక్రమ సంబంధాల వ్యవహారం క్రమంగా తీవ్రమవుతోంది. ఫలితంగా అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో వెలుగులోకి చూసింది. దేవుడి దర్శనం పేరుతో గుడికి తీసుకెళ్లి భర్తను లేపేసింది కట్టుకున్న భార్య. దీంతో ఈ కేసులో తీగలాగితే డొంక అంతా కదిలింది.
చిత్తూరు జిల్లాలో దారుణం-చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో దారుణమైన ఘటన బయటపడింది. కుప్పం పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లె ప్రాంతానికి చెందిన రమేష్, హోసూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని బోయనపల్లె ప్రాంతానికి చెందిన హాసినితో రమేష్‌కు రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది.
గుడిలో దర్శనానికి భర్తను తీసుకెళ్లిన భార్య-రమేష్-హాసిని దంపతులకు ఏడాది వయసున్న పాప కూడా ఉంది. సోమవారం రమేష్ కుటుంబం బోయనపల్లె ప్రాంతానికి వచ్చింది. మరుసటి రోజు అంటే మంగళవారం సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయాని టూ వీలర్‌పై బయలుదేరారు.
సీసీటీవీ పుటేజ్ ద్వారా గుట్టు రట్టు-రాత్రయినా ఇంటికి కూతురు-అల్లుడు రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆలయ సమీపంలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. భర్త, పాపతో హాసిని బైక్‌పై ఆలయానికి వెళ్లినట్లు కనిపించింది. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్‌పై మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తున్నట్లు గుర్తించారు.
హాసిని ఎక్కడన్న దానిపై విచారణ-సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం కనిపించింది. రమేష్ భార్య మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. ఇంటకీ హాసిని ఎక్కడ అనేదానిపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ: ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి శ్రీకారం.. ఆగష్టు తొలివారంలో ప్రారంభం, ఒక్కొక్కరి ఖాతాలో 25 వేలు
రమేష్ మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్, తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు వెంబడించిన భార్య ప్రియుడు, విచక్షణా రహితంగా నరికినట్టు ఘటనా స్థలంలో లభించిన దాని ఆధారాలు బట్టి తెలుస్తోంది.
హత్య తర్వాత హాసిని.. తన ప్రియుడు, ప్రియుడి ఫ్రెండ్స్ తో బైకుపై వెళ్లిపోయినట్టు సమాచారం. రమేష్ శవం దొరకడంతో భార్య-కూతురు ఏమయ్యారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్త హత్య కేసులో నిందితురాలు హాసిని ఇంకా మైనర్ అని గ్రామస్తులు చెబుతున్నారు. హాసిని 9వ తరగతి చదువుతుండగా పెద్దలు పెళ్లి చేశారని అంటున్నారు.