Podarillu Today Episode July 16th: చక్రి ఆకలేస్తుంది వెళ్లి తిందాం పదండి అని ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇంకొక ఆరు నెల తర్వాత జడ్జిగారు రమ్మన్నారు. కాబట్టి ఇప్పట్లో విడాకులు తీసుకోవాలన్న ఆలోచన కూడా మహాలక్ష్మికి రాదు అని చెక్కిరి చాలా సంతోషంగా ఉంటారు.. మహాలక్ష్మి మాత్రం విడాకులు వస్తాయిఅని చాలా సంతోషంగా ఉన్నాను కానీ జడ్జి నా ఆశని ఆవిరి చేసింది అని మహాలక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న సరే దాన్ని మనసులోనే పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు.. ఏది ఏమైనా కూడా చెక్రి మహాలక్ష్మి కలవడానికి దేవుడు మరో ఛాన్స్ ఇచ్చారని చక్రి సంతోషంగా ఉంటాడు. పోతే చక్రి మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు జడ్జ్ గారు విడాకులు ఇచ్చారా లేదా అని కంగారు పడిపోతూ మాధవ్ కన్నా ఇద్దరు కూడా బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు.. ఇక నారాయణ కూడా మొదటిసారి చక్రికి విడాకులు రాకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచించడంతో కన్నా మన నాన్న కూడా మనిషిలాగ ఆలోచిస్తున్నాడు అని సెటైర్లు వేస్తాడు..
చక్రి వెళ్తూ ఉండగా కానిస్టేబుల్ ఎదురుగా కనిపిస్తాడు.. కానిస్టేబుల్ ని చూసిన చక్రి సార్ మీరైతే పెళ్లి చేశారు కానీ మమ్మల్ని విడిపోయేలా చేస్తున్నారుగా అని అంటాడు.. విడాకులు తీసుకోవాలని ఆలోచన మానుకోమని నేను అమ్మాయికి చెప్పాను కదా మళ్లీ ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అని కానిస్టేబుల్ అడుగుతాడు.. ఆ అమ్మాయి ఎంత చెప్తున్నా సరే విడాకులు తీసుకోవాలి అని అంటూనే ఉంది. మీరు మమ్మల్ని కలిపితే మీ నాన్న పశుపతి పేరు పెట్టుకున్నామని అనుకున్నాము కానీ అలా జరిగేలా లేదు అని ఆ కానిస్టేబుల్ తో చక్రి అంటాడు.. నేను అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను మా నాన్న పేరు బిక్షపతి అని నువ్వు గుర్తుపెట్టుకుని కానిస్టేబుల్ అంటాడు.
శైలు కేశవ తో గొడవపడి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే శైలు గొడవ పడింది రా ఇక మాట్లాడను అని నా నుంచి వెళ్ళిపోయింది అని మెకానిక్ షాప్ కు వెళ్ళిన తర్వాత చోటుతో కేశవ చెప్తాడు. అయితే కేశవ మాట విన్న చోటు మా పాట నన్ను మీరు అంతగా బాధపెట్టారు కాబట్టే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్లిపోయినట్లుంది.. కనీసం సారీ అని చెప్పను కూడా చెప్పట్లేదా అన్న బ్రో అని చోటు అడుగుతాడు. కేశవ శైలు కోసం ఆలోచిస్తూ అలాగే ఉండడంతో ఒకసారి ఫోన్ చేసి సారీ అని చెప్పండి అని చోటు అడుగుతాడు. అయితే కేశవ శైలు తో మొదట మాట్లాడొద్దు అని అనుకున్న సరే ఆ తర్వాత తనకి నిజం చెప్పాలని అనుకుంటాడు.. శైలు మెసేజ్ చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉంటుంది.
కన్నా మాధవ్ఇంట్లోకి వచ్చిన తర్వాత టెన్షన్ పడుతూ కనిపించడంతో ఏమైందిరా మహాలక్ష్మి చక్రి ఇద్దరూ వచ్చారా అని అడుగుతాడు.. మా వదిన ఒకటే వచ్చింది చక్రి అన్నయ్య రాలేదు అని చెప్పగానే.. ఏం జరిగిందో చెప్పిందా..? విడాకుల గురించి ఏమైనా చెప్పిందాని మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. మాధవ్ మహాలక్ష్మికి కాఫీ పెట్టి ఇచ్చి పిలవాలని అనుకుంటాడు.. అమ్మ మహా కాఫీ తాగుదువురామ్మ అని బయటకు పిలుస్తాడు మాధవ్.. అయితే లాయర్ దగ్గరికి వెళ్లారమ్మా విడాకుల గురించి ఏమన్నారు వచ్చేసయా అని కంగారుపడుతూనే మాధవ్ అడుగుతారు. అయితే మాధవ్ విడాకులకు అప్లై చేశాను కానీ వాళ్ళు రావడానికి ఇంకొక ఆరు నెలలు పడతాయని అంటున్నారు. ఇంకొక ఆరు నెలలు వెయిట్ చేయమని జడ్జ్ గారు చెప్పారు అని మాధవకు చెప్పగానే మాధవ్ చాలా సంతోషంగా ఉంటాడు.
కానిస్టేబుల్ చక్రి తో మాట్లాడాలని పిలిచి ఏమైంది అని అడుగుతాడు.. మీరు ఎంతగా వార్నింగ్ ఇచ్చిన సరే ఆమె మాత్రం మళ్లీ విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది.. మీరు ఒకసారి ఆమెతో ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వండి సార్ అని చక్రి అడుగుతాడు.. ఇక కానిస్టేబుల్ దామోదర్ మహాలక్ష్మికి ఫోన్ చేసి ఏంటమ్మా మళ్లీ విడాకులు తీసుకోవాలని లాయర్ దగ్గరికి వెళ్ళావా..? నాకు నువ్వు ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేసి చెప్తారు.. మీరు విడాకులు తీసుకోవాలని ఆలోచన మానుకోండి మీకోసం మీ నాన్న ఎంత ప్రెజర్ చేసినా కూడా ఒత్తిడికి తట్టుకొని మరి పెళ్లి చేసాము.. అలాంటిది మళ్లీ మళ్లీ విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని మహాలక్ష్మిని కానిస్టేబుల్ అడుగుతాడు.. మీరు ఇంకొకసారి విడాకులు తీసుకోవాలని చూస్తే నేను అసలు ఒప్పుకోను అని కానిస్టేబుల్ వార్నింగ్ ఇస్తాడు.
కేశవ శైలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే శైలు అక్కడికి వచ్చి పెద్ద గొడవే చేస్తుంది.. శైలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. మొత్తానికి ఇద్దరు గొడవపడి మళ్లీ కలిసిపోతారు. ఇక మహాలక్ష్మి ఆవేశంగా బయటికి వచ్చి చక్రీకి ఇండైరెక్టుగా తిట్ల పురాణం మొదలు పెడుతుంది.. కానిస్టేబుల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని చక్రితో చెప్తుంది.. మనం విడాకులు తీసుకుంటున్న విషయాన్ని కానిస్టేబుల్ కి ఎవరో చెప్తున్నారు వాడికి అన్ని రోగాలు వచ్చి చచ్చిపోతాడు అంటూ మహాలక్ష్మి దిమ్మతిరిగిపోయేలా తిడుతుంది.. చక్రి తనని తిడుతుంది అని మహాలక్ష్మిని ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా తను మాత్రం అసలు వినకుండా తిడుతూనే ఉంటుంది.. మహాలక్ష్మి తిట్ల నుంచి తప్పించుకోవడానికి చక్రి బయటకు వెళ్ళిపోతాడు.. కానీ మహా మాత్రం అసలు మాట వినకుండా కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తుంది.. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. ప్రేమ సేఫ్..