E-Paper
Advertisement

YCP Third List : వైసీపీ మూడో జాబితా విడుదల.. విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికంటే..?

YCP Third List : వైసీపీ మూడో జాబితా విడుదల.. విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికంటే..?
Advertisement

YCP Third List : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితా వచ్చింది. 21 మందితో వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వైసీపీ ఇంఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు. మూడో జాబితాను నిన్ననే ప్రకటించాల్సి ఉండగా.. కొందరి విషయంలో స్పష్టత రాకపోవటంతో ఈరోజుకు వాయిదా పడింది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సుదీర్ఘంగా చర్చించి.. జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంఛార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంఛార్జులుగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్.

Advertisement

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోణేటి ఆదిమూలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ,ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌లను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవింద రెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు నుంచి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఆలూరు నుంచి బూసినే విరూపాక్షి, కోడుమూరు నుంచి డా. సతీష్, గూడూరు నుంచి మేరిగ మురళి, సత్యవేడు నుంచి మద్దిల గురుమూర్తి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన నుంచి ఉప్పాల రామును బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. జోగి రమేష్‌ను పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేసింది. తిరుపతి ఎంపీ స్థానం నుంచి సత్యవేడుకు గురుమూర్తిని కూడా మార్పు చేసింది. ఇక వైసీపీ కండువా కప్పుకోకున్నా కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×