BigTV English

Bollywood Actress Issue: బాలీవుడ్ నటి వ్యవహారం.. ఆ పెద్దాయన చుట్టూ ఉచ్చు, రేపో మాపో..

Bollywood Actress Issue: బాలీవుడ్ నటి  వ్యవహారం.. ఆ పెద్దాయన చుట్టూ ఉచ్చు, రేపో మాపో..

Bollywood Actress Issue:  బాలీవుడ్ నటి వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకుంటోందా? నేతలతోపాటు పోలీసు అధికారులు బుక్కయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఓ పెద్దాయనకు ఇబ్బందులు తప్పవంటూ అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.


బాలీవుడ్ నటి వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలంటే కచ్చితంగా దర్యాప్తు చేయాలని అధికార టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ యవ్వారంలో ఆనాటి ప్రభుత్వ సలహాదారు పాత్రపై విచారణ చేపట్టాలని వర్ల రామయ్య కోరారు. వైపీసీ నేతను కాపాడేందుకు పెద్దాయన తీవ్ర ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించా రు. ఇందులో ఆయన రోల్ గురించి తెలియాలంటే కచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనన్నది ఆయన డిమాండ్. ఈ కేసులో వైసీపీ పెద్దాయనతోపాటు ఇద్దరు పోలీసు అధికారులు ఉండడంపై ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది.

కేసు డీటేల్స్‌ను సీఎంఓ కార్యాలయం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆనాటి విజయవాడ పోలీసు అధికారుల పాత్రపై నిఘా విభాగం వివరాలు సేకరించినట్టు ప్రభుత్వానికి అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. రేపోమాపో ఆ ఇద్దరి అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అప్పటి ప్రభుత్వం పెద్ద, మిగతా వైసీపీ నేతలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. లోతుగా దీనిపై సమాచారం సేకరిస్తోంది.


ALSO READ: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొవ్వలో ఈ వ్యవహరం బయటకు వస్తే… ఇబ్రహీంపట్నంలో కేసు రిజిస్టర్ కావడ మేంటి? అధికారులకు సహకరించిన దిగువస్థాయి పోలీసులు ఎంత మంది ఉన్నారు? విజయవాడ నుంచి ముంబైకి పంపిన స్పెషల్ విమానం ఎవరిది? ఇలా అనేక కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఉన్నతాధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్ద ప్రమేయం ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చిన తర్వాత ముంబై నటి పలు యూట్యూబ్ ఛానెళ్లలో మాట్లాడింది. ఆమె చెప్పిన మాటల వెర్షన్‌పై దృష్టిపెట్టారు.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌లపై నివేదిక రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు మంత్రి నారా లోకేష్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడువారాలకు పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగులకు ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. దీనిపై నేరుగా ప్రధానికి లేఖ రాశారు జగన్. పలుమార్లు మీడియా ముందుకొచ్చారు డిమాండ్ చేశారు కూడా. మొత్తానికి వెతకబోయిన తీగ కాలికి తగినట్టుగా వైసీపీ పెద్దాయన ఇరుక్కోవడం ఖాయమనే వాదన సైతం ఆ పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×