E-Paper
Advertisement

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!
Advertisement

Shoaib Akhtar On Aryavir Sehwag:  అండర్ 19 పురుషుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభమై ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన టీమిండియా, నేపాల్ పై విక్టరీ అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ఊచకోత కోశాడు. 52 బంతుల్లోనే 70 పరుగులు చేసి, తండ్రికి తగ్గ తనయుడిగా ఆర్యవీర్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ తరుణంలోనే వీరూ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!

19 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్ ఎంత బ్యాటింగ్ చేసినా టీమిండియాలో అవకాశం రాదన్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించినా, టీమిండియా తుది జట్టులో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడని హేళన చేశాడు. భవిష్యత్తులో ఆర్యవీర్ సెహ్వాగ్ పరిస్థితి అలాగే ఉంటుందన్నాడు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ కు ఆర్యవీర్ సెహ్వాగ్ ను పంపించాలని వీరూ భాయ్ ని కోరాడు షోయబ్ అక్తర్. పాకిస్తాన్ కు వస్తే, అతన్ని రాజులా చూసుకుంటామని, తానే స్పెషల్ ట్రైనింగ్ ఇస్తానని వెల్లడించాడు. పాకిస్తాన్ కెప్టెన్సీ కూడా ఇప్పిస్తానని ఓవరాక్షన్ చేశాడు. తన ఆఫర్ ను వీరూ భాయ్ వెంటనే ఒప్పుకోవాలని, లేకపోతే ఆర్యవీర్ సెహ్వాగ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం గ్యారెంటీ అని హెచ్చరించాడు. దీంతో ఆర్యవీర్ సెహ్వాగ్ పై షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

భారత దేశంలో టాలెంట్ ఉన్నా పట్టించుకునేవాడు లేడు

భారత దేశంలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. గల్లీకో వైభవ్ సూర్యవంశీ ఉంటాడని, కానీ అందరూ జాతీయ జట్టులోకి రావడంలో విఫలమవుతున్నారని తెలిపాడు. ఒకవేళ టీమిండియా జట్టుకు సెలక్ట్ అయినా, తుది జట్టులో అవకాశాలు రాక సతమమౌవుతున్నారని విమర్శలు చేశాడు. సరిగ్గా ప్లేయర్లను బీసీసీఐ వాడుకోవడం లేదంటూ చురకలు అంటించాడు. ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లు పాకిస్తాన్ దేశంలో ఏ మూలన లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కుర్రాళ్లు పాకిస్తాన్ కు వస్తే, తానే ట్రైనింగ్ ఇస్తాననంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

నేపాల్ మ్యాచ్ లో మెరిసిన ఆర్యవీర్

Advertisement

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వీరూ భాయ్ కొడుకు ఆర్యవీర్ అదరగొట్టాడు. 70 పరుగులు చేసిన ఆర్యవీర్, టీమిండియాను గెలిపించాడు. ఇక పాకిస్తాన్ తో ఈ నెల 8న టీమిండియా తలపడనుంది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

మహ్మద్ షమీ రిటైర్మెంట్..సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు

కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. మహమూద్, వకార్ యూనిస్‌లపై దేశద్రోహి ముద్ర, రంగంలోకి పాక్ ప్రధాని!

న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్ గెలిస్తే.. గుండు గీయించుకుంటా

రొనాల్డూ రిటైర్మెంట్.. కోచ్‌తో గొడవే కారణమా..?

హ‌కీ ప్లేయ‌ర్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన‌ప్పుడు బీసీసీఐకి ఏం రోగం? …ఇంజ‌మామ్ సంచ‌ల‌నం

బ‌క్కోడిపై CSK ఫ్యాన్స్ తిరుగుబాటు? తోపు ప్లేయ‌ర్ల‌ను SRHలోకి పంపిస్తున్నాడ‌ని ఫైర్‌

రెండో వన్డేకు 60% వర్షం ముప్పు.. దేవుడు కూడా ఇండియాను కాపాడ‌లేడంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×