E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి  దొరికిపోతుందా..?
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి కోసం ఇంటికి వెళ్లిన మిస్సమ్మకు పార్థు గురించి చెప్తుంది మంగళ. ఎక్కడున్నాడని మిస్సమ్మ అడిగితే.. రూంలో ఉన్నాడని చెప్తుంది మంగళ. అయితే చూద్దాం పద అని మిస్సమ్మ అంటే ఇద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు. రూంలో దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు పార్థు. మంగళ కోపంగా పార్థును తిడుతూ.. నిద్రకు కరువు వచ్చినోడిలా ఎప్పుడూ దుప్పటి మూసుకుని నిద్రపోతుంటాడు అంటుంది. మిస్సమ్మ రూంలోంచి బయటకు వెళ్లిపోతుంది.

మరోవైపు పార్థును చూశానని చెప్పిన యాదమ్మను తీసుకుని మనోహరి కారులో ఆ ప్లేస్‌కు వెళ్తుంది. మనోహరి, యాదమ్మ కంగారుగా వెళ్లడం చూసిన రాథోడ్‌, అమర్‌ను తీసుకుని వెనకే ఫాలో అవుతుంటాడు. కొద్ది దూరం వెళ్లాక మనోహరి కారు ఆపేస్తుంది. యాదమ్మ ఇక్కడే పార్థును చూశానని చెప్తుంది. వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన రాథోడ్‌ కూడా కార ఆపేస్తే.. ఏంటి ఇక్కడ కారు ఆపేశావు.. వాళ్లు ఆగితే మనం ఆగాలా..? అని అమర్‌ అడిగితే.. అవును సార్‌ మనోహరి వాళ్లు ఏం చేస్తున్నారో చూద్దాం అంటాడు రాథోడ్‌. ఏంటి మనోహరి మీదే గూడచర్యం చేస్తున్నావా..? రాథోడ్‌ అంటూ అమర్‌ అడిగితే.. ఏం లేదు సార్‌ కానీ కొన్ని సార్లు ఆడవాళ్లు బయటకు చెప్పుకోలేరు సార్‌ అలాంటప్పుడు మనమే తెలుసుకోవాలి ఇప్పుడే అదే అనుకోండి అంటాడు రాథోడ్‌.

Advertisement

కారు దిగి అటూ ఇటూ చూసిన మనోహరి.. కచ్చితంగా నువ్వు ఇక్కడే పార్థును చూశావా..? అని అడుగుతుంది. యాదమ్మ  ఇక్కడే చూశాను మనోహరి. మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకుని వస్తుంటే.. ఇక్కడే పార్థు వచ్చి నాకు డాష్‌ ఇచ్చాడు. కూరగాయల బ్యాగ్‌ వదిలేసి ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాను మనోహరి అంటూ యాదమ్మ చెప్తుంది. కానీ మనోహరి నమ్మదు.. కారులో కూర్చున్న అమర్‌ అనుమానంగా ఒక పనిమనిషిని బయటకు తీసుకొచ్చి డస్కర్షన్‌ చేయాల్సిన అవసరం మనోహరికి ఏముంది..? అంటూ అమర్‌ అడిగితే.. ఏమో సార్‌ ఏ అవసరం వచ్చిందో అంటూ రాథోడ్‌ మనసులో మాత్రం యాదమ్మ పని మనిషి కాదు సార్‌ మనోహరి మనిషి అనుకుంటాడు.

రోడ్డు పక్కన ఉన్న సీసీ టీవీ కెమెరాలు చూసి మనోహరి ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుంది. ఆ వీడియో చూస్తే పార్థు ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిపోతుంది అంటూ      మనోహరి చెబితే.. అంటే ఏంటి మనోహరి నేను అబద్దం చెప్తున్నాను అనుకుంటున్నావా..?  అంటూ కోప్పడుతుంది అందుకు మనోహరి అది కాదు చంభా నువ్వు భ్రమ పడ్డావేమో..? లేదంటే పార్థుయే దెయ్యమై వచ్చాడేమో అంటుంది. నువ్వు చంపిన వాళ్లందరూ దెయ్యాలయి తిరుగుతారా..? మనోహరి అంటూ యాదమ్మ అడిగితే.. చనిపోయిన ప్రతి ఒక్కరు దెయ్యాలు అవుతారు కదా చంభా.. నువ్వు పార్థు ఆత్మను చూసి భయపడ్డావేమో అంటుంది.

Advertisement

నేను చిన్నప్పటి నుంచి దెయ్యాలు, భూతాలతో ఆడుకున్నాను మనోహరి కొత్తగా ఇప్పుడు దెయ్యానికి భయపడటం ఏంటి..? అయినా ఆ సీసీ టీవీ ప్రైవేటుది కాదు.. ట్రాఫిక్ పోలీసులు పెట్టారు.. అందులో వీడియో నువ్వు ఎలా చూస్తావు అంటూ యాదమ్మ అడిగితే.. కంట్రోల్‌ రూంకి వెళ్లి చూద్దాం అంటుంది మనోహరి.. నువ్వు వెళ్లగానే వాళ్లు నీకు చూపిస్తారా..? అంటూ యాదమ్మ  అడిగితే.. చూపించరు కానీ డబ్బులు ఇద్దాం.. అప్పుడే కూడా ఇవ్వలేదంటే.. అమర్‌ పేరు వాడుకుందాం అని చెప్పి యాదమ్మను తీసుకుని కంట్రోల్ రూంకు వెళ్తుంది. వెనక కారులో ఉన్న రాథోడ్‌ సార్‌ వాళ్లు వెళ్లిపోతున్నారు మనం వెళ్దామా అంటే.. ఇదేదో అనుమానించాల్సిన విషయమే రాథోడ్‌ పద వెళ్దాం అంటాడు అమర్‌. రాథోడ్ కారు స్టార్ట్ చేస్తూ.. మీకు అనుమానం వచ్చిందంటే మనోహరికి మూడినట్టే సార్‌ అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో  నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తల్లి కాబోతున్న జబర్దస్త్ ఫైమా…విమర్శలు కురిపిస్తున్న నెటిజన్స్!

గుప్పెడంత మనసు సీరియల్ నుంచి అందుకే తప్పుకున్నా: జ్యోతి పూర్వజ్

ఏందిరా ఈ బీటు.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మళ్లీ దుమ్మురేపాడుగా!

బిగ్ బాస్ ఆఫర్ వదులుకోవడంపై జ్యోతి పూర్వాజ్ ఏమన్నారంటే?

మానవత్వం చాటుకున్న నరేష్.. ముఖేష్ కోసం త్యాగం!

దెబ్జానీను చూస్తుంటే కంపరమేస్తోంది.. నీకంటే అతనే బెటర్ అంటూ ఆదిరెడ్డి ఫైర్!

కసి చూపులతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న ఇనయా.. బాపురే కష్టమే..

Big Stories

Advertisement
×