E-Paper
Advertisement

76వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు

76వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు
Advertisement

Chandrababu Naidu: చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లె. 1950 ఏప్రిల్ 20న అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు నారావారి పల్లెలో ప్రాధమిక విద్య చదివినా, హైస్కూల్ కోసం ఆయన కిలోమీటర్ల మేర నడిచి శేషపురం వెళ్లేవారు. ఆ కష్టాలే ఆయనలో పట్టుదల పెంచాయి. తిరుపతి ఎస్వీయూనివర్శిటీలో చదువుతున్నపుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు బయట పడ్డాయి. అక్కడి లైబ్రరీలో గంటల తరబడి గడిపేవారు. ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేయాలనుకున్నారు. కానీ, రాజకీయాల మీదున్న ఆసక్తితో పాలిటిక్స్‌లో అడుగు పెట్టారు.

76వ ఏట అడుగు..

ప్రెజంట్ పాలిటిక్స్‌లో అనుభవ శాలి అంటే ఆయనే గుర్తుకు వస్తారు. అపర చాణక్యుడన్నా ఆయనే. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర రెండు రాష్ట్రాల అత్యధిక కాలం సీఎం అయినా.. ఆయనే. ప్రతిపక్ష నేతగానూ ఆయనే. ఆయన తలుచుకుంటే ఎలాంటి అభ్యర్ధినైనా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి చేయగలరు. ఎంతటి ప్రత్యర్ధినైనా.. పడగొట్టి నిలబడగలరు. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని.. 76వ ఏట అడుగు పెడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.. పొలిటికల్ ట్రాక్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మొదలైన ఆయన ప్రస్తానం..

Advertisement

చంద్రబాబు వయసు 76 ఏళ్లు, రాజకీయ అనుభవం 51 ఏళ్లు, ప్రతిపక్షంలో ఉండినది 15 ఏళ్లు, అధికారంలో ఉన్నది 17 ఏళ్లు ప్లస్.. ఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో చాలానే అంకెలు, సంఖ్యలు వచ్చి జత కలుస్తాయి. ఆ మాటకొస్తే భారతీయ రాజకీయ చరిత్రలోనే చంద్రబాబుది ఒక ప్రత్యేక అధ్యాయం. 1978లో యువ ఎమ్మెల్యేగా మొదలైన ఆయన ప్రస్తానం.. నేడు వెనుదిరిగి చూస్తే ఎన్నో మైలు రాళ్లు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. అధికారం, ప్రతిపక్షం అన్నది కేవలం సాంకేతికాంశమే. ఆయన పొజిషన్ ఏదైనా, పోరాటం ఆగినట్టు ఇప్పటి వరకూ ఎవ్వరూ చూసిందే లేదు. ఇరవై నాలుగ్గంటల్లో 18 గంటల పాటు పని- పని- పని అని అంటుటారు.

Also Read: KCR : కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

సినిమాటోగ్రఫీ మంత్రిగా..

Advertisement

లోకేష్‌ లాంటి కుర్రాళ్లే ఆయన పని తీరు చూసి ఆశ్చర్య పోతుంటారు. అందుకే అంటారు లోకేష్.. తన తండ్రి వయసు 75 ఏళ్లు.. అయినా.. ఆయనలో ముగ్గురు పాతికేళ్ల కుర్రాళ్లున్నారని అంటారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లోనే అరుదైన రాజకీయ గణాంకాలను నమోదు చేసిన వ్యక్తిగా వినుతికెక్కారు. ఆయన 1978లో అత్యంత చిన్న వయసులో అంటే 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. అంజయ్య కేబినేట్‌లో అతి పిన్నవయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన 30 ఏళ్ల వయసులో.. సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలందించారు చంద్రబాబు.

కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ సమయం..?

అప్పట్లో చిత్తూరుజిల్లా పొలిటికల్ సీన్ ఎంతో క్లిష్టంగా ఉండేది. తన సామాజిక వర్గం వారికి రాజకీయంగా అంత అవకాశాలుండేవి కావు. అయినా కానీ చంద్రబాబు వాటన్నిటినీ ధైర్యంగా ఢీకొట్టి.. అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించారు చంద్రబాబు. ఎమ్మెల్యే- మంత్రి అంటూ చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్లిన యంగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో ఆయన ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడ్డమే ఒక రికార్డు అంటే, అదే ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన మేజర్ ఎలిమెంట్. 1983.. ఆయన జీవితంలో కీలకమైన మలుపు తిరిగిన సంవత్సరంగా చెప్పాలి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నుంచి ఓడిపోగా.. ఆతర్వాత కాలంలో ఆయన పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ లోంచి బయట పడి.. తన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో అడుగు పెట్టారు చంద్రబాబు.

రాజకీయాల్లో తొలిసారి..

అక్కడి నుంచీ చంద్రబాబు జీవితం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఆపై చంద్రబాబు టీడీపీకి అన్నీ తానవడం మొదలైంది. 1983లో టీడీపీలో చేరి పార్టీ సంస్థాగత బాధ్యతల నిర్వహించిన చంద్రబాబు.. 1984 ఆగస్టు సంక్షోభంలో NTR అధికార పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాతి రోజుల్లో ఆయన TDP ప్రధాన కార్యదర్శిగా పార్టీకి వెన్నెముకగా నిలిచారు. గ్రామీణ స్థాయిలో కార్యకర్త- వ్యవస్థను బలోపేతం చేయడంలో చంద్రబాబు తన పనితనం చూపించారు. రాజకీయాల్లో తొలిసారి కంప్యూటర్లను వాడిన చరిత- ఘనత చంద్రబాబుదే. ఎన్నికల వ్యూహరచనలో చాకచక్యం చూపించారు. పార్టీల్లో శిక్షణా శిబిరాల కల్చర్ తీసుకొచ్చి.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తర్వాతి కాలంలో ఈ సెగ్మెంట్ నుంచి నాన్ స్టాప్ విన్- రన్ చేస్తూ వస్తున్నారు. 1994లో ఎన్టీఆర్ క్యాబినెట్ లో రెవెన్యూ కమ్ ఫైనాన్స్ మినిస్టర్ గా పని చేసిన చంద్రబాబు.. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి నుంచి ఆయన రాజకీయ జీవితం మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ దశ- దిశ మారిపోయిందనే చెప్పాలి.

Also Read: చావు ద‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌.. తెలంగాణ బీజేపీ!

టాప్ 15లో ఒకరిగా చంద్రబాబు

1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సుమారు 8 ఏళ్ల 8 నెలల పాటు పని చేశారు. ఆ తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు న్నారు. ప్రెజంట్ సిట్యువేషన్ కి వస్తే, 2024 నుంచి నేటి వరకూ లెక్కిస్తే.. మరో రెండేళ్లు ఇందుకు అదనం. 1980-83 మధ్య కాలంలో కాంగ్రెస్ లో మంత్రిగానూ పని చేశారు. ఇటు మంత్రిగా, అటు ముఖ్యమంత్రిగా ఆయన సుమారు 18 ఏళ్ల 9 నెలలు అధికారంలో ఉండగా.. ఈ అధికారిక పని రోజుల సంఖ్య 6,850 పై చిలుకుగా ఉంది. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంల జాబితాలో టాప్ 15లో ఒకరిగా ఉన్నారు చంద్రబాబు. అయితే వారికీ చంద్రబాబుకీ ఉన్న తేడా.. 2004-14 వరకూ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి.. తిరిగి గెలవడం, ఆ తర్వాత 2019- 24 వరకూ ప్రతిపక్ష నేతగా ఉండి.. మళ్లీ నాలుగోసారి సీఎం కావడం అనేది భారత రాజకీయాల్లోనే అరుదైన ఘట్టం. ఇటు ఉమ్మడి ఏపీకి, అటు నవ్యాంధ్రకు సీఎంగా పని చేసిన ఏకైక వ్యక్తి ఆయనే.

చక్రం తిప్పిన నేత..

ఆయన ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. అదే కింగ్ మేకర్ హోదా. మిగిలిన వారంతా ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై సీఎంలుగా ఉండేవారు. కానీ ఒక్క చంద్రబాబు మాత్రమే యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ అంటూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేతగా నిలిచారు. ఇప్పటికీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎంతో సమర్ధవంతంగా పోషిస్తున్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించడం ద్వారా ఇటీవల అమరావతికి చట్టబద్ధత సైతం సాధించగలిగారు చంద్రబాబు. అంతే కాదు దేవగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. తనకు ప్రధాన మంత్రి పదవికి ఆఫర్ వచ్చినా కాదని రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. అబ్ధుల్ కలాం రాష్ట్రపతి పదవి అధిరోహించడంలోనూ కీ రోల్ ప్లే చేశారు.

1990ల్లోనే విజన్ 2020 అంటూ..

తొలి దళిత స్పీకర్, రాష్ట్రపతి వంటి కీలకమైన పదవులు అధిరోహించడంలోనూ చంద్రబాబు క్రియాశీలంగా వ్యవహరించారు. జీఎంసీ బాలయోగి స్పీకర్ గా కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిని చేయడం ద్వారా సామాజిక సమతుల్యతకు పాటుబడ్డారు.దేశంలోని ఎందరో నాయకులతో పోలిస్తే చంద్రబాబు ప్రత్యేకతలేంటని చూస్తే.. 1990ల్లోనే విజన్ 2020 అంటూ ఐటీ రంగం భవిష్యత్ ని శాసిస్తుందని.. ముందే ఊహించడం. హైదరాబాద్ నేడింతటి గ్లోబల్ హబ్ గా ఉందంటే అందుకు ఆద్యుడు చంద్రబాబే. ఈ విషయంలో ఆయన పోరాటం ఒక చారిత్రక అధ్యాయం. అంతగా ఆయన మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ రావడంలో కృషి చేశారు. ఇటు బిల్ గేట్స్, అటు బిల్ క్లింటన్ వంటి వారు హైదరాబాద్ బాట పట్టేలా చేయగలిగారు చంద్రబాబు. 1990ల చివరి రోజుల్లో, 2000ల తొలినాళ్లలో ఒక ప్రాంతీయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ప్రపంచ అగ్రరాజ్య అధినేతను, ప్రపంచ కుబేరుడ్నీ హైదరాబాద్ వైపు చూసేలా చేయడం అప్పట్లో ఒక అద్భుతం.

Also Read: ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×