E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు అనుకూలమైన రోజు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు అనుకూలమైన రోజు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది.

వృషభం

Advertisement

ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. 

మిథునం

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమవుతుంది.

కర్కాటకం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం

ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. 

కన్య

నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.  మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. 

ధనుస్సు

వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కారమౌతాయి తొలగుతాయి. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి.  

మకరం

దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.  

కుంభం

విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఆర్ధికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం

నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×