Gundeninda GudiGantalu Today episode November 7th: ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది అయితే అప్పుడే మనోజ్ వచ్చి రోహిణి ఎక్కడ అని అడుగుతాడు ఏమో ఎవరు కొంపలు కూల్చడానికి వెళ్లిందో అని అంటుంది.. అయితే ప్రభావతి మాటతో రోహిణి చాలా ఫీల్ అవుతుంది. ఇక ఏమీ మాట్లాడకుండా అప్పుడే రోహిణి ఇంట్లోకి వచ్చి అత్తయ్య ఇది మా అమ్మ కోసం తీసుకుని వచ్చాను.ఎలా ఉందో చూడండి అంటే ఇక్కడ ఎవరు మీ అమ్మ మీ అమ్మ ఉందా అని అడుగుతుంది ప్రభావతి. మా అమ్మ లాంటి మీ కోసమే ఇది తీసుకుని వచ్చాను అని అనగానే శృతి సైడ్ గా బిస్కెట్ అంటూ కౌంటర్లు వేస్తుంది.. అయితే రవి శృతి ఇద్దరూ ప్రభావతి ఆ నక్లెస్ ని తీసుకుంటుంది అని బెట్టు పెట్టుకుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మాత్రం సెటైర్ల వర్షం కురిపిస్తాడు.
ప్రభావతి మాటతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇలా నగలు తీసుకొని వచ్చి నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా.. నగల కి వగలు చూపించే ఆడదాన్ని కాదు. నేను నాకు నగలు మీద అంత మోసేమీ లేదు అని ప్రభావతి అనగానే బాలు ఏంటి నాగావతి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తాడు. ఇక తర్వాత ప్రభావతిపై కౌంటర్లు వేయడంతో పాటుగా రోహిణి అని కూడా కలిపి తిడుతూ ఉంటాడు అంతే కాదు ఇంటి కోసం అని కూడా పెట్టాలి కదా అని ఒక డబ్బా తీసుకొని వచ్చి అందులో వేయమని అంటాడు మనోజ్ సచ్చిన వెయ్యను అని అంటాడు. మింగింది మీరే కాబట్టి మీరే ఇంటిని విడిపించాలి అని మనోజ్ కి కూడా చుక్కలు చూపించేలా మాట్లాడుతాడు.. మొత్తానికి ఆ డబ్బాలు వేసేటప్పుడు ప్రభావతి రోహిణి తెచ్చిన అన్నాక చాలా బాగుంది అని దాన్ని తీసుకుంటుంది. ఇక బాలు అస్సలు సిగ్గులేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి తెచ్చిన తీసుకుంటుంది అని బెట్టు వేసిన శృతి గెలుస్తుంది. మొత్తానికి ఎపిసోడ్ కాస్త సరదాగా సందడిగా సాగుతుంది.
రోహిణి అత్తయ్య తనని క్షమించింది అంటూ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే తను తెచ్చిన హారం వేసుకుంది కాబట్టి ఖచ్చితంగా తన మీద కోపం పోయి ఉంటుందని రోహిణి అనుకుంటుంది. ఇక రోహిణి ఏం చేసినా కూడా అందులో న్యాయం ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రభావతి ఎలాగైనా సరే రోహిణి నీకు క్షమించదు అని అందరూ అనుకుంటారు కానీ ప్రభావతి మాత్రం అందరికీ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ రోహిణిని క్షమించి తను తెచ్చిన హారం వేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ప్రభావతి ఇక మారదా అని ఆలోచిస్తూ ఉంటారు. రోహిణి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయింది అని గాల్లో తేలిపోతూ ఉంటుంది. కానీ మీనా సుతి మాత్రం వీళ్ళు ఇద్దరు ఇద్దరే ఎవరికీ ఏమాత్రం తగ్గిపోరు అని ఆలోచిస్తారు.
ఇక రెస్టారెంట్ కి వెళ్దామని ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.. అయితే ఇద్దరూ అక్కడికి వెళ్ళగానే నీతూ వచ్చే రవి శృతి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటారు. ఏంటి ఏమైంది ఎందుకు? నాకోసం వెయిట్ చేస్తున్నావు ఏం జరిగింది అని నీతును శృతి అడుగుతుంది. మన రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ కోసం వచ్చారు కదా వాళ్ళు చాలా బాగుందని కామెంట్ చేశారు.. చిన్న రివ్యూ తో మన రెస్టారెంట్ పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నీతో అనగానే అవునా నిజమా అని ఇద్దరు సంతోషపడతారు. అయితే ఈ శుభ సమయంలో హెడ్ చెఫ్ ని వేరే రాష్ట్రం నుంచి తీసుకునే రావాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అని అడుగుతుంది.
రవి ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నువ్వు నన్నే హెడ్ చెఫ్ ను చేస్తావని అనుకున్నాను చాలా ఆశపడ్డాను. కానీ నువ్వు ఇలా అంటావని నేను అసలు ఊహించలేదు. ఎలాగైనా సరే రవి అనగానే శృతి అది నీ ప్రాబ్లం నేను దీనికోసం ఎంతో కష్టపడ్డానో అది నీకు కూడా తెలుసు కానీ నువ్వు ఇలా అనుకుంటే నేను ఏమి చేయలేను అని నీతూ అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అతను ఇలా మాట్లాడతావా నేను అసలు ఊహించలేదు ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు అంటున్నావు అని చాలా బాధపడిపోతుంది శృతి. రవి వల్లే ఈ రెస్టారెంట్ పూర్తిగా మారిపోయింది అలాంటిది ఇప్పుడు ఇలా మీరు మాట్లాడటం ఏమీ బాగోలేదు అని శ్రుతి సీరియస్ అవుతుంది..
ఈ రెస్టారెంట్ కోసం రవి ఎంతో చేశాడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా రెస్టారెంట్ కోసమే పని చేశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాంటి రవిని హెడ్ చెఫ్ గా చేయకుండా ఎవరినో హెడ్గా తీసుకురావడం ఏంటి అని శ్రుతి పెద్ద రచ్చ చేస్తుంది. ఇది కాకపోతే ఇంకొక పది ఉంటాయని శృతి అనగానే నేను నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చూసాను. అంతే తప్ప మీరు ఇలా అంటరు నేను అసలు నీతో అంటుంది. ఇక శృతి రవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి.
Also Read :శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?