E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన పక్కిటి వ్యక్తిని చలపతి కోపంగా తిడతాడు. వీధిలో పరువు పోయింది అంటూ బాధపడుతుంటాడు. వెంకీ ఇంటర్వ్యూకు వెళ్తుంటే అనుమానిస్తాడు. నువ్వు కూడా ఆ ఇంటికే వెళ్తున్నావా..? అంటాడు. లేదని ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్తాడు. అందుకు చలపతి ఎవరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ బాధపడతాడు.

ఇంటర్వ్యూకు వెళ్లిన వెంకీ ప్రొపైల్‌ చూసిన మేనేజర్‌ చాలా రోజుల తర్వాత మంచి ప్రొపైల్‌ చూశాను. కానీ ఇంతకు ముందు కంపెనీలో ఎందుకు మానేశావు అంటూ అడగ్గానే.. వెంకీ జరిగిన విషయం చెబితే.. కుక్క పని కుక్క చేయాలి. పిల్లి పని పిల్లి చేయాలి అనవసరంగా కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చావు అంటే నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వలేను అంటాడు. వెంకీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన వెంకీ ఇరిటేట్‌ అవుతూ.. తన సర్టిఫికెట్స్‌ పడేయబోతూ.. ఆగిపోతాడు. అప్పుడే నందు వెళ్తుంది. వెంకీని ఓదారుస్తుంది. వివరాలు తెలుసుకుని వర్కులో సిన్సియారిటీ చూపించాలి కదా తప్పు జరుగుతుందని  చెప్పడం తప్పెలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చావు నీకు ఉద్యోగం ఇవ్వను అన్నారు. నాకు తెలిసి ఇక నాకు ఎక్కడా జాబ్‌ రాదు.. ఆ దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదే అర్థం కావడం లేదు అంటూ బాధపడతాడు వెంకీ.

Advertisement

రాజు గార్డెన్‌లో కూర్చుని ఉంటే లక్కీ వెళ్తాడు. లక్కీని చూసి రాజు వెళ్లిపోతుంటే.. నేను నీతో మాట్లాడాలని వచ్చానురా అంటే రాజు కోపంగా తిడతాడు. నాకు నీతో మాట్లాడాలని లేదు అంటే.. నేను ఆరోజు ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను అందుకే సారీ కూడా చెప్పాను కదా..? జరిగిందదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇంటి తోడు అల్లుళ్లం కదా అరేయ్‌ మనం ఈ అకేషన్‌ను ఎంజాయ్‌ చేద్దాం అంటూ లక్కీ చెబితే.. అది ఎప్పటికీ కుదరదు నీ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది అంటూ రాజు వెళ్లిపోతాడు.

తర్వాత రాజు, ఇందులకు శోభనం ముహూర్తం పెట్టాలని పంతులును పిలిపిస్తే.. అతను రాజు, ఇందు మెడలో తాళి కట్టిన ముహూర్తం బాగాలేదని చెప్తాడు. అప్పుడే భ్రమరాంబ తాను ఇదే అనుకున్నానని తిడుతుంది. రేఖ కూడా ఎవరో కట్టాల్సిన ముహూర్తానికి హీరోలా ఎంట్రీ ఇస్తే ఇలాగే ఉంటుంది అంటుంది. ముహూర్తాలు పెట్టుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటే పంచభూతాలే కాదు పంచాంగం కూడా సహకరించదు అంటుంది. అపర్ణ కోపంగా ఆపుతారా మీ అపశకునపు మాటలు అంటే.. ఏంటో నేను మాట్లాడినప్పుడే అపశకునాలు అవుతాయి ఏంటో.. అంటుంది.   తర్వాత పంతులు పరిహారం చెబితే తమకు నచ్చలేదని వెళ్లిపోతారు రేఖ, భూషణ్‌, భ్రమరాంబ. పరిహారాల తర్వాత మూడు రోజులకు శోభనం చేయోచ్చని చెప్తాడు పంతులు. రాజ డిస్సపాయింట్‌ అవుతాడు.

Advertisement

తర్వాత రూంలోకి వెళ్లిన రాజు, ఇందు జుట్టు విరబోసుకోవడం చూసి మొగుడి పోస్ట్‌ వచ్చాక ఇది చాలా అందంగా కనిపిస్తుంది ఏంటో మనసులో కోరికలు మెలికలు తిరిగిపోతున్నాయి అంటూ వెళ్లి ఇందును పట్టుకోబోతే ఇందు రూంలోంచి బయటకు గెంటేస్తుంది. ఇరిటేటింగ్‌గా రాజు కిందకు వెళితే రాజుతో శేషు ఓ అటాడుకుంటాడు. అపర్ణ వచ్చి రాజు ఈ మూడు రోజులు నువ్వు ఇక్కడే పడుకోవాలి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. రాజు తాపంతో రగిలిపోతుంటే.. శేషు వచ్చి కూల్‌ చేస్తాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Saturday TV Movies : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

తల్లి కాబోతున్న జబర్దస్త్ ఫైమా…విమర్శలు కురిపిస్తున్న నెటిజన్స్!

గుప్పెడంత మనసు సీరియల్ నుంచి అందుకే తప్పుకున్నా: జ్యోతి పూర్వజ్

ఏందిరా ఈ బీటు.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మళ్లీ దుమ్మురేపాడుగా!

బిగ్ బాస్ ఆఫర్ వదులుకోవడంపై జ్యోతి పూర్వాజ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×