E-Paper
Advertisement

ఆఫీసులో ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే సహోద్యోగులు ఉన్నారా? మీ మానసిక ప్రశాంతతకు భగవద్గీత సూత్రాలు

ఆఫీసులో ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే సహోద్యోగులు ఉన్నారా? మీ మానసిక ప్రశాంతతకు భగవద్గీత సూత్రాలు
Advertisement

Bhagavad Gita Workplace Stress| ఆఫీసులో కొంతమంది సహోద్యోగులు ఉంటారు. మీరు ఏ పని చేసినా వారికి ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఒకరోజు పని ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తారు. మరోరోజు మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదని విమర్శిస్తారు. కంపెనీ పరిస్థితి బాగోలేదంటూ ఇతరుల్లోనూ భయాన్ని కలిగిస్తారు. ఇలాంటి వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే మనకు కూడా చిరాకు, ఆందోళన పెరుగుతాయి. అయితే ఎదుటివారి ఆలోచనలను మనం మార్చలేకపోవచ్చు. కానీ వారి మాటలకు ఎలా స్పందించాలో మన చేతుల్లోనే ఉంటుంది. ఇందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సమబుద్ధి సూత్రం మంచి మార్గాన్ని చూపిస్తుంది.

1. ఫలితాల గురించి కాకుండా మీ కర్తవ్యంపై దృష్టి పెట్టాలి

భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం:

  • కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
Advertisement

ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మన దృష్టి కర్మ చేయడంపైనే ఉండాలి. ఫలితాలపై ఉండకూడదు. ఆఫీసులో ఎవరైనా మీ పని గురించి విమర్శిస్తే వెంటనే స్పందించకండి. మీ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఇతరుల మాటల వల్ల మీ పని ప్రభావితం కాకుండా చూసుకోండి.

2. మీ మానసిక ప్రశాతంతతను కాపాడుకోవాలి

ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వ్యక్తులతో మాట్లాడితే మన ఆలోచనలు కూడా ప్రతికూలంగా మారవచ్చు. మొదట్లో ఇది చిన్న విషయంలా అనిపించినా, కొంతకాలానికి ఆ ప్రభావం మన పనితీరుపై పడుతుంది. అందుకే ఎదుటివారి సమస్యలను మీ సమస్యలుగా భావించకండి. వారి నిరాశను మీ మనసులోకి తీసుకురాకండి. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ పరిస్థితిలో ఏం చేయాలో బోధించారు. ప్రతి పరిస్థితిలో మనసును సమతుల్యంగా ఉంచుకోవడం. మంచి, చెడు పరిస్థితుల్లోనూ తొందరపడి స్పందించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

3. నెగెటివ్ వ్యక్తులతో అవసరమైనంత మాత్రమే మాట్లాడాలి

Advertisement

ప్రతి ఒక్కరి ఆలోచనా విధానాన్ని మార్చడం మన బాధ్యత కాదు. ఎవరైనా పదేపదే ఫిర్యాదులు చేస్తుంటే వారితో వాదనకు దిగకండి. ‘చూద్దాం ఏం జరుగుతుందో’, ‘పరిస్థితులు మెరుగుపడవచ్చు’ అంటూ ప్రశాంతంగా సమాధానం చెప్పండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. వీలైతే సానుకూలంగా ఆలోచించే సహోద్యోగులతో సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.

Also Read: చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

4. అర్జునుడి జీవితమే స్పూర్తి

మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు ఎన్నో భావోద్వేగాలకు లోనయ్యాడు. తన బంధువులతోనే యుద్ధం చేయాల్సి రావడంతో అయోమయానికి గురయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యాన్ని గుర్తుచేసి, మనసును స్థిరంగా ఉంచుకోవాలని బోధించాడు. ఈ బోధన.. మనం ఉద్యోగ జీవితంలోనూ పాటించవచ్చు. ఇతరులు ఎలా ప్రవర్తించినా మనం మన బాధ్యతలను మర్చిపోకూడదు. విభేదాలు వచ్చినా గౌరవంగా మాట్లాడాలి.

Also Read: ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు

5. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి

అన్యాయాన్ని భరించడం ఎల్లవేళలా పరిష్కారం కాదు. ఆఫీసులో వేధింపులు లేదా తీవ్రమైన సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. అయితే చిన్నచిన్న ఫిర్యాదుల వల్ల మన సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకూడదు.
ఎదుటివారు నెగెటివ్‌గా మాట్లాడటం కొనసాగించవచ్చు. కానీ మన స్పందనను మనమే నిర్ణయించుకోవాలి. ప్రశాంతంగా ఉండండి, మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల మాటలు మీ మనశ్శాంతిని ప్రభావితం చేయకుండా చూసుకోండి.

Related News

మీ కండరాలు త్వరగా ముసలిబారుతున్నాయా? ఇంట్లోనే ఈ మూడు పరీక్షలు చేసి తెలుసుకోండి

నోట్లో వేయగానే కరిగిపోయే క్రిస్పీ ఫిష్ అమృత్‌సరి.. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకోండి!

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

Big Stories

Advertisement
×