E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/11/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు – వారికి చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/11/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు – వారికి చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి.

వృషభం

Advertisement

 వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. 

మిథునం

 బందు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం

Advertisement

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

సింహం

వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

కన్య

 వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు.  ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి.

వృశ్చికం

 చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు.

ధనుస్సు

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  ఆధ్యాత్మిక విషయాలపై  దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం

 నూతన వస్తు లాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

కుంభం

చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.  వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం

 ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×