E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (22/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (22/09/2025)               
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో  పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. పాత ఋణముల ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

 

వృషభ రాశి:

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు.కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి.    

మిథున రాశి:  

Advertisement

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబసభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన  ఆర్ధిక లాభాలు పొందుతారు. వృత్తి  ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది.    

కర్కాటక రాశి:

ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు

సింహరాశి:

వ్యాపారమున   స్నేహితుల  నుంచి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో  నూతన అవకాశములు అందుతాయి.     

కన్యారాశి :

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  కొంత నిరాశ  కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో  ఊహించని విభేదాలు  కలుగుతాయి. ధన వ్యవహారాలలో  లోటుపాట్లు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నూతన వ్యాపారాల ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం  లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మిత్రుల   సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

వృశ్చికరాశి:

స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.  ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల ఆప్తుల   నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన  కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది

ధనస్సు రాశి:

ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలొ నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున  శుభకార్యాలను నిర్వహిస్తారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మకరరాశి:

కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో  ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.

కుంభరాశి:

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగమున అదనపు  బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు.   వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు

మీనరాశి:

నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారములు అందుతాయి . ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు  లభిస్తుంది . ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×