Gajulu Gajulu Song:గాజులు గాజులు గలగల అటు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని రాధమ్మ కూతురు షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ పాట ఒక్క రాత్రిలోనే వన్ మిలియన్ దాటడంతో స్టార్ అయిపోయింది రాధమ్మ కూతురు. అయితే ఈ పాట ఎంతగా ఫేమస్ అయిందో అంతకుమించిన వివాదాలు కూడా మూటగట్టుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఈ వివాదంపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది రాధమ్మ కూతురు .
దివ్య పుట్టింది మంచిర్యాల
రాధమ్మ కూతురు అసలు పేరు దివ్య.తను పుట్టింది మంచిర్యాల .దివ్య మాట్లాడుతూ తాను భవాని మాల తీసుకున్న సమయంలో ఈ పాట బాగా వైరల్ అయిందని, రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడంతో ఒకసారిగా పాట బాగా ఫేమస్ అయిందని తెలిపింది..అయితే కళ్యాణి టాక్స్ ద్వారా కళ్యాణి అనే ఆవిడ తనపై విమర్శలు చేయడంతో తనపై నెగిటివిటీ పెరిగిపోయిందని చెప్పుకొచ్చింది .
ఎన్నో వీడియోలు చేసినా రాని నెగెటివిటీ కామెంట్స్
అంతకీ ఎన్నో వీడియోలు చేసినా రాని నెగెటివిటీ కామెంట్స్ ఈ పాటకు వచ్చాయని ,దానికి కారణం నా పాట రాత్రి వైరల్ కావడమేనని తెలిపింది.ఇక వీడియోలో ప్లాస్టిక్ పూలు ,లిప్స్టిక్ వేసుకోవడం తప్పంటూ కామెంట్ చేస్తున్నారని తమ ప్రాంతంలో వరిజినల్ పూలు దొరకడం చాలా కష్టమని అందుకే అలా పెట్టుకున్నాయని తెలిపింది.ఇందు వల్లే దేవతలని అలంకరించే విధానంలో కొన్ని పద్ధతులు పాటిస్తామని చెప్పుకొచ్చింది.అయితే రీల్స్ కోసం దీక్ష తీసుకోలేదని,తనకి భక్తి ఉంది కాబట్టే తీసుకున్నానని , బయటి వాళ్లు ఎన్ని విమర్శలు చేసిన అది మారిపోదని చెప్పుకొచ్చింది.
అయితే తనపై ఒక రేంజ్ లో ట్రోల్స్ జరగడంతో బాగా బాధపడ్డాను అని ముఖ్యంగా దీక్షలో ఉన్న సమయంలో చేసిన కామెంట్స్ తనని మరింత కుంగ దీశాయని, అందుకే దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పు చూపిస్తూ వీడియోలను వదిలానని తెలిపింది.
కేవలం జర్నీ ఖర్చులకోసం 5000 మాత్రమే
పాటకి చాలా డబ్బులు తీసుకున్నాను అన్న కామెంట్స్ పై దివ్య రియాక్ట్ అవుతూ మన పల్లె జీవితాలు ఛానల్ కి చెందిన దర్శకుడు సింహాద్రి తనను కలిసి పాట పాడాలని కోరారని చెప్పింది . ఇక అందుకు కేవలం జర్నీ ఖర్చులకోసం 5000 మాత్రమే తీసుకున్నానని తెలిపింది. ఎవరైనా డబ్బులు ఇచ్చి తనకి సపోర్ట్ గా మాట్లాడాలని ప్రూవ్ చేస్తే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేస్తానని సవాల్ విసిరింది .
తన కుటుంబం కష్టపడి పెంచిందని డబ్బు కోసం తప్పు చేయనని చెప్పుకొచ్చింది. ఇక తాను ప్రస్తుతం ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్నానని, ఒకవైపు చదువుతూనే మరోవైపు ఇండస్ట్రీలో కూడా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించానని, చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు చేయడ మంటే తనకి ఇష్టమని చెప్పింది .
ఎలాంటి విమర్శల వర్షం కురుస్తుందో !
ఇక తన వీడియోలు నచ్చకపోతే బ్లాక్ చేయాలని, అంతేకానీ లైఫ్ ని స్పాయిల్ చేసేలా నేటి కామెంట్స్ పెట్టొద్దని చెప్పుకొచ్చింది.చూడాలి మరి రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య చేసిన ఈ కామెంట్స్ పై ఎలాంటి విమర్శల వర్షం కురుస్తుందో !