OTT Movie : థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఒక రొమాంటిక్ సినిమా ఓటీటీలో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ సినిమా ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఇది ‘ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే మలయాళం సినిమాకి రీమేక్ గా వచ్చింది. ఈ బాలీవుడ్ సినిమా మొదట రొమాంటిక్ స్టోరీగా మొదలై, ఆ తరువాత థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో హీట్ పెంచుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఆపరేషన్ రోమియో’ (Operation Romeo) 2022లో విడుదలైన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. శశాంత్ షా డైరెక్ట్ చేసిన చిత్రం, 2019 మలయాళ ఫిల్మ్ ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీకి అఫీషియల్ రీమేక్. ఇందులో సిధాంత్ గుప్తా, వేదికా పింటో లీడ్ రోల్స్‌లో నటించగా, షరద్ కేల్కర్, భూమికా చావ్లా, కిషోర్ కదమ్ సపోర్టింగ్ కాస్ట్‌లో నటించారు. నీరజ్ పాండే, శీతల్ భాటియా నిర్మించిన ఈ సినిమా, 2022 ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదలైంది. 2022 జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 12 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
ఆదిత్య శర్మ, నేహా కస్లీవాల్ ముంబైలో లవ్‌లో ఉన్న ఒక యువ జంట. ఆది ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే, నేహా కాలేజీ స్టూడెంట్ గా ఉంటుంది. అయితే వాళ్ల పేరెంట్స్‌కి వీళ్ల రిలేషన్ గురించి తెలియదు. నేహా బర్త్‌డే సందర్భంగా, ఆది ఆమెకు రింగ్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని, లాంగ్ డ్రైవ్‌కి ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలో ఒక రొమాంటిక్ మూమెంట్ కోసం ఆది, నేహాను హాస్పిటల్ పార్కింగ్ లాట్‌కి తీసుకెళ్తాడు. కానీ అక్కడ మంగేష్ జాదవ్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులమని చెప్పి వీళ్లను హరాస్ చేస్తారు. మంగేష్ వాళ్లను బెదిరించి, డబ్బు డిమాండ్ చేస్తాడు. ఇది వాళ్ల రొమాంటిక్ మూమెంట్ ని భయంకరంగా మారుస్తుంది.
ఆది ATM నుంచి డబ్బు తీసుకురావడానికి వెళ్తే, మంగేష్ నేహాతో కారులో ఒంటరిగా ఉంటాడు. ఆ సమయంలో ఏం జరిగిందనేది సినిమాలో కీలక ట్విస్ట్. నేహా అప్పుడు ఏం జరిగిందో ఆదికి చెప్పకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇది ఆదిని కన్ఫ్యూజ్ చేసి, వాళ్ల రిలేషన్‌లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆది తర్వాత మంగేష్‌ని ఫాలో చేసి, అతను నిజమైన పోలీస్ కాదని తెలుసుకుంటాడు. సినిమా రివెంజ్ థీమ్‌తో ముందుకు సాగుతూ, క్లైమాక్స్‌లో నేహా నిర్ణయం, ఆది రియాక్షన్‌తో షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఇంతకీ ఆ రోజు కారులో ఏం జరిగింది ? ఆది రివేంజ్ తీర్చుకుంటాడా ? వీళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుందా ? అనే విషయాలను ఈసినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా