E-Paper
Advertisement

Ugadi Festival: ఉగాది రోజు ఆ పనులు తప్పనిసరిగా చేయాలట – అవేంటో తెలుసా..?

Ugadi Festival: ఉగాది రోజు ఆ పనులు తప్పనిసరిగా చేయాలట – అవేంటో తెలుసా..?
Advertisement

Ugadi Festival: తెలుగు నూతన సంవత్సర ఉగాది రోజున చేసే కొన్ని సంప్రదాయ పనులు సంవత్సరం మొత్తం శుభం, ఆరోగ్యం, సంపద కలిగిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం త్వరగా నిద్ర లేవాలి: ఉగాది పండుగ రోజు తప్పకుండా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలోనే నిద్ర లేవాలట. ఇలా లేచి రోజు ప్రారంభించడం వల్ల ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంటుందట.

Advertisement

తైలాభ్యంగ స్నానం చేయాలి: తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని తర్వాత ఒంటికి నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలట. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదని పండితులు సూచిస్తున్నారు.

కొత్త బట్టలు ధరించాలి: ఉగాది రోజు తప్పకుండా కొత్త బట్టలు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని కొత్త బట్టలతో ప్రారంభించడం ఆనందానికి సూచకంగా చెప్తున్నారు.

Advertisement

ఇంటికి మామిడి తోరణం కట్టాలి: స్నానాదికాలు పూర్తి అయ్యాక ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలట. మామిడి ఆకులతో ఇంటి డోర్లకు తోరణం కడితే పాజిటివ్‌ ఎనర్జీ  ఇంట్లోకి వస్తుందని పండితులు సూచిస్తున్నారు.

రంగురంగుల ముగ్గులు వేయాలి: ఉగాది పండుగ రోజు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేయడం చాలా శుభ సూచకట.

ఇంట్లో లేదా గుడిలో దేవుడికి పూజలు చేయాలి: ఉగాది రోజు ఉదయం దేవాలయానికి వెళ్లడం లేదా ఇంట్లో పూజ చేయడం మంచిది. ప్రత్యేకంగా చాలా మంది ఇంట్లో పూజ చేసుకుని తర్వాత గుడికి వెళ్తుంటారు. లేదా గుడికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పండితులు. లేదా గుడికి వెళ్లి వచ్చినా సరే ఇంట్లో పూజ చేసుకున్నా సరే ఎలాగైనా సరే కానీ దేవుడి పూజతోనే మీ ఉగాది పండుగ రోజు ప్రారంభించాలట.

పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి: ఉగాది పండుగ రోజు దేవుడికి పూజలు చేసిన తర్వాత ఇంట్లో పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, పెద్దలకు పాదాభివందనం చేయాలని వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభసూచకం అంటున్నారు.

ఉగాది పచ్చడి తినాలి: ఉగాది రోజు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదంతో పాటు ఉగాది పచ్చడిని కుటుంబం సబ్యులంతా కలిసి తినాలట. అయితే ఉగాది పచ్చడిని ఎటువంటి భోజనం కానీ టిఫిన్‌ కానీ చేయకుండా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ఇంకా ఉగాది పండుగ రోజు పేదలకు బీదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలట. ఇలా చేయడం వల్ల మీరు అంతకు ముందు చేసిన పాపపు కర్మలు తొలగిపోయి కొత్త సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందట. అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం కూడా శుభాలకు సంకేతంగా భావిస్తారట. కాబట్టి ప్రతి ఒక్కరు ఉగాది పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని పండితులు సూచిస్తున్నారు. ఇంకా ఉగాది రోజున మనసులో మంచి సంకల్పం పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా శుభ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నవగ్రహాల భార్యలు ఎవరో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×