E-Paper
Advertisement

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే
Advertisement

men struggle with dieting| బరువు తగ్గాలంటే డైట్ చేయాలి.. తక్కువ తినాలి.. ఎన్నో ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి మాటలు వినగానే చాలామంది పురుషులు వెనక్కి తగ్గుతున్నారా? కొత్త అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. డైట్‌లో ఆహార నియమాలే కాదు, వాటిని ఎలా పరిచయం చేస్తున్నారన్నది కూడా పురుషుల ఆసక్తిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

పురుషులకు సంప్రదాయ డైట్ ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?

బరువు తగ్గాలంటే కేలరీలు లెక్కించడం, ఆహారాన్ని నియంత్రించడం, కఠినమైన డైట్ పాటించడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి విధానాలు కొంతమంది పురుషులకు మొదటి నుంచే కష్టంగా అనిపిస్తాయి. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. సమస్య కేవలం ఆహార ఎంపికలకు మాత్రమే పరిమితం కాదు. బరువు తగ్గించే కార్యక్రమాలను రూపొందించే విధానం కూడా పురుషుల ఆసక్తిని ప్రభావితం చేయవచ్చు.

అధ్యయనంలో పరిశోధకులు ఏం గుర్తించారు?

Advertisement

యునైటెడ్ కింగ్‌డమ్ దేశానికి చెందిన ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ పరిశోధకులు పురుషులు బరువు తగ్గించే కార్యక్రమాలను ఎలా చూస్తారో పరిశీలించారు. ఈ పరిశోధన వివరాలు PLOS One జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు 30 ఏళ్లు పైబడిన 24 మంది బ్రిటన్ పురుషులతో మాట్లాడారు. వీరందరూ గతంలో అధిక బరువు సమస్య బాధితులే. వీరంతా బరువు తగ్గినా చాలామంది సంప్రదాయ డైట్‌ను కఠినంగా, ఎక్కువ కాలం కొనసాగించడం కష్టంగా ఉందని చెప్పారు.

డైట్ అనే మాటే కొందరిలో ఆసక్తిని తగ్గించవచ్చు

చాలామంది పాల్గొన్నవారు డైట్ అంటే తమకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవడంగా భావించారు. కఠినమైన నియమాలు, రుచికరమైన ఆహారం త్యాగం చేయాల్సి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే డైట్ సంస్కృతిని మహిళలు, అందం, శరీర ఆకృతితో ఎక్కువగా అనుసంధానించినట్లు వీరంతా భావించారు. సోషల్ మీడియా, మ్యాగజైన్లు, ప్రకటనలు కూడా ఈ అభిప్రాయాన్ని ప్రభావితం చేయవచ్చు.

పురుషులకు బరువు తగ్గే విధానాల్లో మార్పులు అవసరం

Advertisement

పరిశోధకులు బరువు తగ్గించే ప్రొగ్రామ్‌ల సందేశాన్ని మార్చాలని సూచించారు. కేవలం తక్కువ తినడంపై దృష్టి పెట్టకుండా శారీరక సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. క్రీడలు, స్టామినా, వ్యాయామం, శారీరక కదలికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి యాక్టివిటీస్ బరువు తగ్గే ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు అవకాశం ఉంది.

కనిపించే పురోగతి ప్రోత్సాహాన్ని పెంచవచ్చు

బరువు తగ్గడమే విజయానికి ఏకైక కొలమానం కాకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు. శక్తి పెరగడం, ఫిట్‌నెస్ మెరుగుపడటం వంటి మార్పులను కూడా గుర్తించాలి. ఇలాంటి చిన్న విజయాలు వ్యక్తుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం సులభంగా మారవచ్చు.

పోటీ పడే తత్వం, టార్గెట్ సెట్ చేయడం కూడా ఉపయోగపడవచ్చు

కొంతమంది పురుషులు పోటీ, కొలిచే ఫలితాలు తమను ప్రోత్సహిస్తాయని పరిశోధనలో తెలిపారు. తొలి దశలో కనిపించే చిన్న విజయాలు కొనసాగేందుకు ప్రేరణ ఇస్తాయి. క్రీడల ఆధారిత కార్యక్రమాలు కూడా బరువు నిర్వహణను మరింత ఆసక్తికరంగా మార్చగలవు.

Also Read: స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

కుటుంబం, స్నేహితుల మద్దతు కూడా ముఖ్యమే

భాగస్వాములు, స్నేహితులు, మెంటర్లు లేదా బడ్డీల మద్దతు ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కొంతమంది పురుషులకు వారి భాగస్వాములు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో సహాయపడ్డారు. కలిసి టార్గెట్స్ సాధించే కార్యక్రమాలు మరింత స్థిరమైన మార్పులకు దోహదపడే అవకాశం ఉంది.

బరువు తగ్గడంపై కొత్త దృక్పథం అవసరం

పరిశోధన ప్రకారం.. పురుషులందరూ సంప్రదాయ డైట్‌లను ఇష్టపడరని చెప్పలేం. అయితే యాక్టివిటీస్ ప్లాన్ చేయడం, వాటి ఉద్దేశం, పాల్గొనే ఆసక్తిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లను చురుకుగా, సామాజికంగా, లక్ష్య ఆధారితంగా మార్చడం ఉపయోగపడతాయి. ఆహార నియంత్రణపై మాత్రమే దృష్టి పెట్టకుండా వ్యక్తిగత పురోగతికి ప్రాధాన్యం ఇవ్వడం మెరుగైన విధానం.

Also Read: గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×