E-Paper
Advertisement

Actress Yami Gautam : యామీ గౌతమ్ హీరోయిన్ కాకుంటే ఏమైయ్యేదో తెలుసా..?

Actress Yami Gautam : యామీ గౌతమ్ హీరోయిన్ కాకుంటే ఏమైయ్యేదో తెలుసా..?
Advertisement

Actress Yami Gautam : చాలామంది ఏవేవో చేయాలని కలలు కంటూ ఉంటారు. తమ కలలను నిజం చేసుకునేందుకు కొందరు ఎంతవరకైనా కష్టాన్ని అనుభవించి ముందుకు వెళ్తారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతారు. ఎంతోమంది తమ కలలన్నీ సహకారం చేసుకుని మరి కొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఇండస్ట్రీలోకి రాకముందు ఏమో జాబులు కూడా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు.. కొందరేమో తమకు నచ్చిన విభాగంలో పనిచేసి మళ్లీ ఇండస్ట్రీలో అనుకోని విధంగా అవకాశాలు రావడంతో ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమధ్య హీరోయిన్లు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయం పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ యామి గౌతమి కూడా సినిమాల్లోకి రాకుంటే ఏమైయ్యేదో అన్నది బయటపెట్టింది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఏం అవ్వాలని అనుకుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

యామీకి ఇలాంటి కోరిక ఉందా..?

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి యామీ గౌతమ్.. ఇక ఈమె హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ముద్దుగుమ్మ. ఈ నార్త్ బ్యూటీ మొదట సీరియల్స్లలో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఆమె సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న ఈమె సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన సినీ ప్రయాణం, విమర్శలు, అవార్డులు వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తనకు వచ్చిన అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ అని ఆమె అంటున్నారు. అంతే కాదు కొన్ని సినిమాలు ఆమెను ఆ స్థాయిలో నిల్చబెట్టాయని అందుకే సినిమాల్లోనే కంటిన్యూ అవుతున్నట్లు చెప్పింది. ఒక దశలో అవకాశాలు తగ్గితే సినిమాలను వదిలి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి వ్యవసాయం చేయాలని కూడా ఆలోచించానని ఆమె అన్నారు. అయితే బాలా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చినట్లు ఆమె చెప్పారు. మొత్తానికైతే యామి మనసులోని మాట బయటికి వచ్చింది.. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

Advertisement

Also Read :జగన్నాథుని సన్నిధిలో చైతూ -శోభిత జంట.. వీడియో వైరల్..

యామీ సినిమాల విషయానికొస్తే.. 

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ.. ‘ఉల్లాస ఉత్సాహ’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘నువ్విలా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. తర్వాత వరుసగా తెలుగులోనే ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరింది ఈమె.. ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ సినిమా ఆమె కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది..’ ఏ థర్స్డే’, ‘చోర్ నికల్ కే భాగా’, ‘ఆర్టికల్ 370’ వంటి చిత్రాల్లో నటించి తన ఇమేజ్ ని పెంచుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వస్తుంది.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×