2026 Bajaj Pulsar 125: బజాజ్ ఆటోకు చెందిన మోస్ట్ పాపులర్ మోడల్ పల్సర్ ఎప్పటికప్పుడూ అప్ డేట్ అవుతూ యువతను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలుమార్లు కొత్త కొత్త ఫీచర్లతో విడుదల కాగా, తాజాగా కొత్త 2026 పల్సర్ 125 వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఈ మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒకటి సింగిల్ సీట్ కాగా, మరొకటి స్ప్లిట్ సీట్. సింగిల్ సీట్ బైక్ ధర రూ. రూ. 89,910 కాగా, స్ప్లిట్ సీట్ ధరను కంపెనీ రూ. 92,046 గా ఫిక్స్ చేసింది. రెండు వేరియంట్ల ఆన్ రోడ్ ధరలు మరికాస్త ఎక్కువగా ఉండనున్నాయి. ఇన్సూరెన్స్, ఆర్టీఏ ఖర్చుల కారణంగా కొంచె ధర పెరిగే అవకాశం ఉంటుంది.
కొత్త 2026 పల్సర్ 125 బైక్‌లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. గత వెర్షన్ లో హాలోజన్ ల్యాంప్ లకు భిన్నంగా, LED ల్యాంప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది బజాజ్ కంపెనీ. ఫ్రంట్ ఫాసియా తేలికపాటి రీడిజైన్‌ను కలిగి ఉంటుంది. టర్న్ ఇండికేటర్లు కూడా ఇప్పుడు LEDతోనే అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా, దాని బాడీ ప్యానెల్ మీద కొత్త రంగులు, రిఫ్రెష్ చేసిన గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇవి బైక్ కు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం బ్లాక్ గ్రే, బ్లాక్ రేసింగ్ రెడ్, బ్లాక్ సియాన్ బ్లూ, టాన్ బీజ్ తో రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్నాయి. గత మోడల్ తో పోలిస్తే ఈ మార్పుల కారణంగా బైక్ ధర రూ. 3,500 పెంచింది. అయితే, ఈ పెంపుతో వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం కనిపించడం లేదు. ఈ బైక్ అమ్మకాల మీద ఈ పెంపు ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు.
Read Also: రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రేంజ్ కూడా సూపరండోయ్!
పల్సర్ 125 ఇతర అంశాల్లో పెద్దగా మార్పులు ఏవీ లేవు. ఈ బైక్ 124.4cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా పవర్ ను పొందుతుంది. ఐదు స్పీడ్ గేర్‌బాక్స్ తో అనుసంధానించబడిన ఈ మోటారు 8,500 rpm దగ్గర గరిష్టంగా 11.64bhp, 6,500 rpm దగ్గర 10.8Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. షాక్ అబ్జార్ప్షన్ హార్డ్ వేర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, గ్యాస్ చార్జ్డ్ ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్ లో ముందు భాగంలో 240mm డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ యూనిట్ ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. కొత్త పల్సర్ తో అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
Read Also: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 17 ట్రక్కులు లాంచ్ చేసిన టాటా మోటార్స్!