Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మందుల చీటి తారుమారైన కారణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం, వ్యవస్థలో లోపాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
నాగ బాలరాజు అనే వృద్ధుడు నరాల సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. వయస్సు పైబడడంతో పాటు నరాలకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అదే సమయంలో.. అదే ఆస్పత్రిలో నాగ బాలరాజు అనే పేరుతోనే మరో పేషెంట్ వచ్చాడు. అతడు డయాబెటిస్‌తో బాధపడుతూ రెగ్యులర్ చికిత్స్ కోసం ఆస్సత్రికి ఆశ్రయించారు.
ఇద్దరి పేషెంట్ల పేర్లు ఒకటే కావడంతో డాక్టర్ తీవ్ర తప్పిదానికి పాల్పడ్డాడు. డయాబెటిస్ రోగికి ఇవ్వాల్సిన మందుల చీటీని నరాల సమస్యతో వచ్చిన వృద్దుడు నాగ బాలరాజుకు ఇచ్చాడు. ఆ మందులు హైడోస్ డయాబిటిక్ డ్రగ్స్ కావడంతో.. అవి వృద్దుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. మందులు వాడిన కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి విషమించింది.
వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను ఆప్రమత్తం చేసినా అప్పటికే ఆలస్యమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో నాగ బాలరాజు మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆస్పత్రి యాజమాన్యం.. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే పేరున్న పేషెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మందుల చీటీ సరైన విధంగా పరిశీలించకపోవడం వంటి అంశాలు ఈ దుర్ఘటనకు కారణమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ:మురుగు నుంచి ముక్తి.. సరూర్‌నగర్ చెరువుకు హైడ్రా కొత్త హంగులు
మందుల చీటీ తారుమారు.. రోగి మృతి
కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్ర విషాదం
ఒకే పేరున్న ఇద్దరు పేషెంట్ల విషయంలో డాక్టర్ చేసిన పొరపాటు
నరాల సమస్యతో ఆసుపత్రికి వచ్చిన నాగ బాలరాజు అనే వృద్ధుడు
అదే సమయంలో ఆస్పత్రికి అదే పేరుతో ఉన్న మరో డయాబెటిక్ పేషెంట్
దీంతో డయాబెటిక్… pic.twitter.com/hLxwOkWA3o
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2026