E-Paper
Advertisement

డీలిమిటేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీట్లు ఎలా తగ్గుతాయి, బిల్లుని అడ్డుకుని ఏం సాధించారు?

డీలిమిటేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..  సీట్లు ఎలా తగ్గుతాయి, బిల్లుని అడ్డుకుని ఏం సాధించారు?
Advertisement

Chennai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలను సూటిగా ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి అంశాలను లేవనెత్తారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. బిల్లులు అడ్డుకుని ఏం సాధించారని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

డీలిమిటేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరపున సీఎం చంద్రబాబు హాజరయ్యారు. రెండురోజుల ప్రచారంలో కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. రీసెంట్‌గా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల చట్ట సవరణలు సభలో వీగిపోయాయి.

దీనిపై తాము విజయం సాధించామని చెప్పకనే చెప్పాయి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. ఈ నేపథ్యంలో ఆ విషయాలను తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. మహిళలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని అడ్డుకుని విపక్షాలు తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు. మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక విషయాలు ప్రస్తావించారు.

Advertisement

సీట్లు ఎలా తగ్గుతాయి? బిల్లుని అడ్డుకుని ఏం సాధించారంటూ విపక్షాలకు సూటి ప్రశ్న

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయని ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై నోరు విప్పిన సీఎం చంద్రబాబు, డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరుగుతాయన్నారు. సీట్ల పెంపు గురించి బిల్లులో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 59కి పెరుగుతుందన్నారు.

కేవలం తమిళనాడు మాత్రమే కాదు, ఏపీ-తెలంగాణలో కూడా సీట్లు పెరుగుతాయన్నారు. ⁠డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఫార్ములాతో సీట్ల పునర్విభజన జరుగుతుందన్నారు. జనగణన ఆధారంగా వెళ్తే దక్షిణాది రాష్ట్రాలు వెనుకపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ALSO READ: అంబటి రాంబాబుకు కష్టాలు.. మళ్లీ అరెస్టు తప్పదా? ఈసారి ఏమైంది?

తాను ద్రవిడ వ్యక్తినేనని, దక్షిణాది అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి ఉందన్నారు. దేశంలో ⁠ముందుచూపు ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అని, అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విజనరీ లీడరని అన్నారు.  చెన్నై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెద్దగా మార్పులేదని, మూడు దశాబ్దాల మాదిరగానే ఉన్నాయన్నారు.

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఎంజీ రామచంద్రన్ పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని, ⁠హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్నారు. యువతకు భవిష్యత్, మంచి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ప్రజలు ఈసారి ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగుతోందని, కేంద్ర-రాష్ట్ర సమన్వయం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని వివరించారు. రాజకీయ లాభాల కోసం రాష్ట్రానికి నష్టం చేయడం సరికాదని, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×