E-Paper
Advertisement

Karate Kalyani – Anvesh: అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులా? కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు!

Karate Kalyani – Anvesh: అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులా? కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Karate Kalyani – Anvesh: ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (Naa Anveshana) ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. హిందూ ధర్మంపై, దేశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై నటి కరాటే కల్యాణి (Karate Kalyani) యుద్ధం ప్రకటించారు. అన్వేష్‌ను భారత్‌కు రప్పించి, ఆయన పాస్‌పోర్ట్ రద్దు చేయించే వరకు నిద్రపోనని సవాల్ విసిరారు. త్వరలోనే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అవుతాయని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది:

యూట్యూబ్‌లో 1.3 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న అన్వేష్, తన ట్రావెల్ వీడియోలలో హిందూ దేవుళ్లను, భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడారని కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం అన్వేష్ పొరపాటని ఆమె హెచ్చరించారు. హిందుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆమె మండిపడ్డారు. తన ఫిర్యాదు వల్లే కేసులు నమోదయ్యాయని, అన్వేష్ తన ఛానెల్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు లేనిపోని కట్టుకథలు అల్లుతున్నారని కరాటే కల్యాణి విమర్శించారు.

లుక్ అవుట్ నోటీసులు.. పాస్‌పోర్ట్ రద్దు:

Advertisement

ఈ వివాదంలో కరాటే కల్యాణి వెనక్కి తగ్గడం లేదు. అన్వేష్‌కు త్వరలోనే లుక్ అవుట్ నోటీసులు వస్తాయని, ఆయనను విదేశాల నుంచి రప్పించి చట్టపరంగా బుద్ధి చెబుతామని ఆమె స్పష్టం చేశారు. “అన్వేష్‌ది కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే. ఇక ఆయన పాస్‌పోర్ట్ రద్దు చేయించే వరకు నా పోరాటం ఆగదు” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం దాటి వెళ్లి కూర్చుని భారత్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, అన్వేష్‌కు నిద్ర లేకుండా చేస్తానని ఆమె బహిరంగంగా సవాల్ విసిరారు.

also read:Vijay – Rashmika: విజయ్ – రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఆశ్చర్యపరుస్తున్న అతిథుల లిస్ట్!

సోషల్ మీడియాలో వార్.. ఎవరి వెనుక ఎవరు:

Advertisement

ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు అన్వేష్ ట్రావెల్ వీడియోలను సమర్థిస్తుంటే, మరికొందరు కరాటే కల్యాణి హిందూ ధర్మం కోసం చేస్తున్న పోరాటాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అన్వేష్ కావాలనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వ్యూస్ పెంచుకుంటున్నారా? లేక నిజంగానే ఆయన టార్గెట్ అయ్యారా? అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, ఒక సెలబ్రెటీ యూట్యూబర్ మరియు ఒక సీనియర్ నటి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×