Amaravati Railway: ఏపీ రాజధాని అమరావతికి అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. రాజధాని అంటే సకల సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం రోడ్డు మార్గమే కాకుండా రైలు, విమానం కనెక్ట్‌విటీ ఉండేలా ప్రణాళికలు అములు చేస్తున్నారు. తాజాగా మరో 300 ఎకరాల భూసేకరణ కోసం రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతికి రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు భవనాల నిర్మాణం, మరోవైపు భూగర్బ కేబుల్ వ్యవస్థల పనులు జోరందుకున్నాయి. అవి పూర్తి అయ్యేనాటికి మరికొన్ని పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.
అమరావతికి రైల్వే లైన్ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లాలోని నంబూరు స్టేషన్‌కు వయా అమరావతి మీదుగా రైల్వే లైను రానుంది. అందుకోసం 300 ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వేశాఖ.
ఆ గ్రామాల్లో భూసేకరణ.. రైల్వేశాఖ నోటిఫికేషన్
ఎర్రుపాలెం నుంచి వయా అమరావతి మీదుగా నంబూరు స్టేషన్ వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ కోసం300 ఎకరాల భూమి సేకరించనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో భూములను సేకరించనుంది. ప్రైవేటు, ప్రభుత్వ, ఎసైన్డ్ భూములు అందులో ఉన్నాయి. పరిటాల గ్రామ పరిధిలో దాదాపు 73 ఎకరాలు సేకరించనుంది.
ఆ ప్రాంతంలో దాదాపు మూడెకరాల గెస్ట్‌హౌస్‌కు సంబంధించి 3 పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వాటిని పరిశీలించిన తర్వాత రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములను సేకరించాలని నిర్ణయించింది.
ALSO READ: కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
ఇకపై ఆ భూములు కేంద్ర ప్రభుత్వానికి చెందనున్నాయి. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు దాదాపు 56 కిలోమీటర్ల మేరా రైల్వే లైన్ రానుంది. తొలుత రైల్వే భూసేకరణకు సిద్ధమైంది. అయితే రైతులు వ్యతిరేకించడం, క్షేత్రస్థాయిలో పనులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవడంతో రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రాజధానికి అన్ని రకాలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి.