E-Paper
Advertisement

Car Doors Ban: ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడ్రన్ ఫీచర్‌ను బ్యాన్ చేసిన చైనా.. అదే దారిలో బ్రెజిల్, ఎందుకంటే?

Car Doors Ban: ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడ్రన్ ఫీచర్‌ను బ్యాన్ చేసిన చైనా.. అదే దారిలో బ్రెజిల్, ఎందుకంటే?
Advertisement

గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో చైనాలో తయారు చేయబడిన మోడళ్లలో పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌  అనేవి మోడ్రన్ ఫీచర్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే, తాజాగా ఈ డోర్స్ గురించి డ్రాగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని ప్యాసింజర్ కార్లపై పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌ ను బ్యాన్ చేస్తూ కీలక ప్రకటన చేసింది.

చైనాలో పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌ బ్యాన్

మోడ్రన్ కార్లు విద్యుత్తుతో పనిచేసే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ తో వస్తాయి. వీటిని కీతో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.  నిజానికి ఇవి ప్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ వైబ్‌ ను ఇస్తాయి. మనదేశంలోనూ విద్యుత్తుతో పాప్ అవుట్ అయ్యే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కామన్  అయ్యాయి. అయితే, ఈ హ్యాండిల్స్ కారణం తీవ్ర సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వీటిని బ్యాన్ చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.

ఎందుకు వీటిని బ్యాన్ చేస్తున్నారంటే?

Advertisement

వాస్తవానికి ఈ హ్యాండిల్స్ నుంచి పవర్ పాస్ అవుతుంది. అయితే, కారు ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులను కాపాడేందుకు స్థానికులు, అత్యవసర సిబ్బంది విద్యుత్ తో పని చేసే డోర్ హ్యాండిల్స్ ముట్టుకోవడం వల్ల షాక్ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం విద్యుత్ తో పని చేసే డోర్ హ్యాండిల్స్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. కార్ల తయారీ సంస్థలు సౌందర్యం, సృజనాత్మకత, ఏరోడైనమిక్ సామర్థ్యం కోసం ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ను  ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డోర్ హ్యాండిల్స్ బాడీ ప్యానెల్స్ కూల్ గా ఉంటాయి.

పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌  తో ఇబ్బందులు  

విద్యుత్ తో పని చేసే డోర్ హ్యాండిల్స్  చైనాలో బాగా పాపులర్ అయ్యాయి. ఇవి గడ్డ కట్టే మంచులోనూ ఓపెన్ అవుతాయి. అయితే, విద్యుత్ సరఫరా నిలిపివేయబడిన తర్వాత అవి పనిచేయవు. అయితే, యాక్సిడెంట్స్ సమయంలో సహాయక చర్యలు కష్టమవుతాయి. ఒకవేళ విద్యుత్ వ్యవస్థ డ్యామేజ్ అయితే, OEMలు మెకానికల్ ఫెయిల్‌ సేఫ్‌ కు కారణం అవుతాయి. వీటి వల్ల డోర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. చైనాలోకి ఇంపోర్ట్ అయ్యే కార్లకు కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 2027, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Advertisement

Read Also: టాటా To మారుతి సుజుకి.. మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు!

బ్రెజిల్ లోనూ పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌  నిషేధం

అటు బ్రెజిల్ లోనూ పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌  పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చైనా మాదిరిగానే ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ ఫెయిల్యూర్ సమయంలో ప్రయాణీకుల భద్రతను పెంచడమే లక్ష్యంగా  ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇండియాలోనూ పవర్డ్ డోర్ హ్యాండిల్స్‌  పై నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త హెల్మెట్, ఫీచర్లు అదుర్స్ భయ్యా!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×