E-Paper
Advertisement

Sharwanand: శర్వానంద్ ఊహించని నిర్ణయం.. భవిష్యత్తులో ఇబ్బంది రాదు కదా!

Sharwanand: శర్వానంద్ ఊహించని నిర్ణయం.. భవిష్యత్తులో ఇబ్బంది రాదు కదా!
Advertisement

Sharwanand:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఛార్మింగ్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు శర్వానంద్ (Sharwanand)..ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ దూసుకుపోతున్న ఈయన.. ఏడాది కాలం తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి కథ పరంగా ఈ సినిమా అద్భుతం కానీ సరైన సమయంలో థియేటర్లు దొరకక.. కలెక్షన్స్ రాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం..

దీనికి తోడు హీరో అలాగే చిత్ర బృందం సరైన ప్రమోషన్స్ చేపట్టకపోవడం వల్లే ప్రేక్షకులలోకి వెళ్లలేదు. కానీ సినిమా విడుదలయ్యాక కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా ప్రజలలోకి వెళ్ళింది. ఇక సినిమా చూద్దామంటే థియేటర్ ల కొరత. అలా మొత్తానికైతే సినిమాకు అన్యాయం జరిగిందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. ఇకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

Advertisement

ALSO READ:Mega 158: చిరు సరసన మరో సీనియర్ బ్యూటీ.. భలే సెట్ చేశారే!

వారి ఆశీస్సులే నా విజయానికి కారణం – శర్వానంద్

ఈ వేడుకలో పాల్గొన్న శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేయడమే కాకుండా ముహూర్తం షాట్ కు క్లాప్ కట్టిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..” నిన్ననే నేను బాలయ్య బాబుతో మాట్లాడాను. నా పరువు నిలబెట్టావని ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఇకపై నా ప్రతి సినిమాకి కూడా ఆయనే ముహూర్తం పెట్టాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.. అంతేకాదు సీనియర్ హీరోల ఆశీస్సులు తనపై ఉండడం వల్లే తన ప్రతి విజయానికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు.

రెమ్యూనరేషన్ పై శర్వానంద్ కీలక నిర్ణయం..

Advertisement

ఇదిలా ఉండగా నిర్మాత అనిల్ సుంకరపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ మరో సంచలన ప్రకటన చేశారు శర్వానంద్. ఆయన మాట్లాడుతూ..” అనిల్ సుంకర మళ్లీ వరుసగా పెద్ద సినిమాలు చేసే వరకు నా తదుపరి చిత్రానికి నేను ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోను. ఒక హీరో, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తాం”.. అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే నెక్స్ట్ సినిమాకు అనిల్ శంకర నిర్మాణంలో తీస్తే ఒక రూపాయి కూడా తీసుకోనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు శర్వానంద్. ఈ విషయంపై భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందేమో అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేయగా.. ప్రేక్షకుల నుండి సరైన ఆదరణ లభిస్తే భవిష్యత్తులోనే కాదు ఎప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రావు అని అభిమానులు అండగా నిలుస్తున్నారు.

ఆయనతో మల్టీ స్టారర్ మూవీ చేస్తా – శర్వానంద్..

మల్టీ స్టారర్ గురించి కూడా ప్రస్తావించారు శర్వానంద్..అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు చిన్న రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై శర్వానంద్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో ఒక చిన్న కామియో పాత్ర పోషించారు శ్రీ విష్ణు. ఆయన గొప్ప మనసును నేను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఇక భవిష్యత్తులో అనిల్ సుంకర బ్యానర్లో శ్రీ విష్ణుతో కలిసి పూర్తిస్థాయి మల్టీ స్టారర్ సినిమా చేస్తాను. ఇద్దరం కలిసి వెండితెరపై సందడి చేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికైతే శర్వానంద్ శ్రీ విష్ణు తో కలిసి మల్టీస్టారర్ తో మన ముందుకు వస్తానని చెప్పుకొచ్చారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×