E-Paper
Advertisement

Electric Scooter Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Electric Scooter Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

పెట్రో స్కూటర్లతో పోల్చితే, ఎలక్ట్రిక్ స్కూటర్లు నడిపేవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది. ఎండా కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధిని పెంచడానికి, రోలింగ్ నిరోధకతను తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన టైర్ ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి. బ్యాటరీని ఆదా చేయడానికి ఎకో మోడ్‌ను ఉపయోగించాలి. స్మూత్ డ్రైవింగ్ కోసం స్థిరమైన, మితమైన వేగం చాలా ముఖ్యం. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను ఉపయోగించడం వల్ల శక్తి పునరుద్ధరణ జరుగుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద పరిమితికి మించి బరువులు వేయకూడదు. రోజువారీ ఉపయోగం కోసం బ్యాటరీని 20%–80% మధ్య ఉంచేలా చూసుకోవాలి. స్కూటర్ ను ఎండలో కాకుండా నీడలో పార్క్ చేయడం మంచిది.

వేసవిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

⦿ టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్: తక్కువగా గాలి ఉన్న టైర్లు రోలింగ్ నిరోధకతను పెంచుతాయి. బ్యాటరీని ఎక్కువగా తీసుకుంటాయి. గరిష్ట సామర్థ్యాన్ని నిర్ధారించడానికి వారానికి సిఫార్సు చేయబడిన టైర్ ప్రెషర్ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి.

Advertisement

⦿ స్మూత్ రైడింగ్ అలవాట్లు: సడెన్ బ్రేకులు, ఒకేసారి రేస్ పెట్టడం లాంటివి చేయకూడదు. ఎంత స్మూత్ గా డ్రైవ్ చేస్తే అంత మంచిది. బ్యాటరీ అంత సేవ్ అవుతుంది.

⦿ ఎకో మోడ్‌ని ఉపయోగించండి: తక్కువ వేగంలో లో వెళ్లేలా ఎకో మోడ్ ను ఉపయోగించాలి. ఈ మోడ్ కారణంగా బ్యాటరీ రేంజ్ ఎక్కువగా వస్తుంది.

Advertisement

⦿ రీజెనరేటివ్ బ్రేకింగ్: స్కూటర్ వేగాన్ని తగ్గించేటప్పుడు శక్తిని తిరిగి పొందడానికి దాని రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను ఉపయోగించాలి. రైడింగ్ చేసేటప్పుడు బ్యాటరీని కొద్దిగా రీఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది.

⦿ వెయిట్ కంట్రోల్: స్కూటర్ మీద పరిమితికి మించి బరువులు వేయకూడదు. అదనపు బరువు మోటారు, బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ తీవ్రమైన వేడిని కాకుండా చూసుకోండి: ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఎక్కువ సేపు ఎండలో ఉంచకూడదు. ఎందుకంటే వేడి అనేది బ్యాటరీ పని తీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.

Read Also: కారు ఎంత స్పీడ్ లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది? హైవేలో ఎంత? సిటీలో ఎంత?

⦿ స్పీడ్ కంట్రోల్: ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం వల్ల బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. వేగంగా వెళ్లడం, సడెన్ బ్రేకులు వేయడం కంటే..  స్థిరమైన, మితమైన వేగాన్ని కొనసాగించడం వల్ల మెరుగైన ప్రయాణాన్ని సాధించే అవకాశం ఉంటుంది.

⦿ ఎక్కువ శక్తి అవసరమయ్యే ప్రయాణాలు వద్దు: నిటారుగా ఉన్న రోడ్ల మీద ప్రయాణాలు చేయడం కంటే, ఎక్కువ భారం పడని ప్రయాణాలు కొనసాగించడం మంచింది. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే చదునైన, మృదువైన రోడ్లను ఎంచుకోవడం మంచిది.

Read Also: ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×