India Qualification Scenario: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament )
టీమిండియా పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. ఈ ఒక్క ఓటమి కారణంగా టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. పాకిస్తాన్ అయినా సెమీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది కానీ.. ఇండియా వెళ్లాలంటే చాలా కష్టపడాలి. సూపర్ 8లో భాగంగా టీమిండియా తన తర్వాతి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాలి. అలా గెలిచినా కూడా కచ్చితంగా రన్ రేట్ బాగా ఉండాలి.
టి20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ ఛాన్స్ ను ( India Qualification Scenario ) కష్టతరం చేసుకుంది. సూపర్ 8లో భాగంగా… మిగిలిన వెస్టిండీస్ అలాగే జింబాబ్వే పైన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది టీమిండియా. ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించడమే కాకుండా.. రన్ రేట్ కూడా చాలా కీలకంగా అని ఉంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా రన్ రేట్ -3.800 గా ఉంది.
ఈ రన్ రేట్ తో ( Run Time) టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లడం చాలా కష్టం. కాబట్టి జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పైన భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు రన్ రేట్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలోకి ఆరు పాయింట్లు వస్తాయి. ఇటు టీమిండియా కు నాలుగు పాయింట్లు వస్తాయి. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు తమ సూపర్ 8 మ్యాచ్ లలో ఒకటికంటే ఎక్కువ గెలవకూడదు. ఇన్ని కండిషన్లు సెట్ అయితేనే టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.
టి20 ప్రపంచ కప్ లో జింబాబ్వే అత్యంత భయంకరంగా ఆడుతోంది. ఇప్పటికే శ్రీలంక అలాగే ఆస్ట్రేలియాపై ( Australia) విజయం సాధించింది జింబాబ్వే. ఇప్పుడు ఇండియాను కూడా ఓడించే దిశగా అడుగులు వేస్తోంది. మరి అలాంటి జింబాబ్వేను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇటు వెస్టిండీస్ లాంటి భయంకరమైన జట్టును తక్కువ అంచనా వేయకూడదు. మొత్తానికి సూర్య కుమార్ యాదవ్ సేనకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్లుగా వ్యవహారం తయారైంది.
🚨 INDIA SEMI-FINAL QUALIFICATION SCENARIO 🚨
Even if India wins against West Indies and Zimbabwe, their semi-final spot isn't guaranteed.
– India now has to win both games by huge margins, because it's all about Net Run Rate.
– Best of luck to West Indies and Zimbabwe, time… pic.twitter.com/VJTYYhe6qB
— Salman. (@TsMeSalman) February 22, 2026