E-Paper
Advertisement

Honda Dio 125 X Edition: హోండా డియో 125 X ఎడిషన్ విడుదల, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Honda Dio 125 X Edition: హోండా డియో 125 X ఎడిషన్ విడుదల, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Honda Dio 125 X Edition Launched: హోండా నుంచి మరో సరికొత్త స్కూటర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల ఆవిష్కరించిన డియో 125 X-ఎడిషన్‌ ను ఇండియన్ మార్కెట్ లోకి రూ. 87,733 ధరకు విడుదల చేసింది. కొత్త డియో 125 వేరియంట్ స్పెషల్ కలర్ స్కీమ్ ను కలిగి ఉంది. ఇది స్కూటర్‌ కు స్పోర్టియర్ లుక్‌ను ఇస్తుంది. ఇంతకీ కొత్త ఎడిషన్ ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

స్పెషల్ కలర్ స్కీమ్ లో కొత్త డియో 125X

కొత్త డియో 125 X వేరియంట్ ఒకే కలర్ స్కీమ్ తో వస్తుంది. పెర్ల్ సైరెన్ బ్లూ, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్స్ ను కలిగి ఉంటుంది.  ఈ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ బాడీ ప్యానెల్స్‌ పై ముదురు నీలం రంగును కలిగి ఉంది. ఆప్రాన్ గ్రే కలర్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. మరింత అందాన్ని కలిగించే ఫంకీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఎరుపు రంగు పెయింట్ చేసిన రిమ్‌లు బాడీ కలర్స్ కు క్వయిట్ ఆపోజిట్ గా ఉంటాయి.

Advertisement

Read Also: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 8 పల్సర్ బైక్స్ లాంచ్!

కొత్త డియో 125 X వేరియంట్ ఫీచర్ల గురించి..

కొత్త డియో 125 X వేరియంట్ ఫీచర్లను పరిశీలిస్తే.. H స్మార్ట్ వేరియంట్ లాగానే ఉంటుంది. ఈ స్కూటర్ టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్ కోసం స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్‌ తో వస్తుంది. చివరగా, గ్లోవ్ బాక్స్‌ లో USB C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది ప్రయాణ సమయంలో రైడర్ ఫోన్‌ ను ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

Advertisement

Read Also: హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

డియో 125 X-ఎడిషన్ ఇంజిన్ గురించి..

డియో 125 X-ఎడిషన్ లో టెక్నికల్ గా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. అదే 123.92cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 8.19 bhp పవర్, 10.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త వేరియంట్ హోండా డియో 125 లైనప్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకోనుంది. హోండా కంపెనీ మరికొద్ది రోజుల్లోనే డియో 125కి పూర్తి స్థాయిలో అప్ డేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా డియో 125 X-ఎడిషన్ తో మార్కెట్ లో మరింతగా తన సత్తాను చాటుకోవాలని ప్రయత్నిస్తుంది.

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×