Honeymoon Murder: దేశంలో కొత్త ట్రెండ్ మొదలైందా? ఇష్టం లేని పెళ్లి చేసుకుని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను చంపేస్తున్నారా? నిన్న ఇండోర్.. నేడు రాజస్థాన్? రేపు ఎక్కడన్నది అసలు ప్రశ్న. వివాహం జరిగిన మూడు నెలలకు ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. అంతేకాదు హిట్ అండ్ రన్ గా మార్చి అడ్డంగా బుక్కైంది. అసలేం జరిగింది.
రాజస్థాన్‌లో హనీమూన్ హత్య.. పెళ్లైన మూడు నెలలకే
దేశంలో ట్రెండ్ మారింది. తల్లిదండ్రులు చూసిన సంబంధాలను అమ్మాయిలు ఓకే చేసేవారు. అన్నివైపులా పరిశీలించి, కుటుంబాల గురించి ఒకరినొకరు తెలుసుకుని అప్పుడు ఓకే అయితే చేసేవారు. ఏమైనా నెగిటివ్ సంకేతాలుంటే మధ్యలో మిడిల్‌డ్రాప్ అయ్యేవారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కాకపోతే వివాహం తర్వాత భర్తను చంపేస్తున్నారు.
గతేడాది ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఇండోర్‌కి చెందిన ఓ యువతి.. భర్తని మేఘాలయకు తీసుకెళ్లి చంపేసింది. తాజాగా రాజస్థాన్‌లో వివాహం జరిగిన 90 రోజులకు ప్రియుడితో కలిసి భర్తని లేపేసింది. పైగా ఆ వ్యవహారాన్ని హిట్ అండ్ రన్ గా మార్చాలని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే..
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో హనీమూన్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన ఆశిష్ మూడు నెలల కిందట అంజుని వివాహం చేసుకున్నారు. ఇద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. కానీ అంజు మాత్రం హ్యాపీగా లేదు. చివరకు తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయింది. అదే సమయంలో తన మాజీ ప్రియుడు సంజుతో రిలేషన్ షిప్ కంటిన్యూ చేసింది.
ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, హిట్ అండ్ రన్ కేసుగా మార్చేందుకు
అత్తింట్లో జరిగిన విషయాలను ప్రియుడితో చెప్పింది. ఇద్దరు కలిసి ఉండాలంటే తన భర్తని చంపాలని డిసైడ్ అయ్యింది. అందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఇదే సమయంలో అంజుని మందలించారు కుటుంబసభ్యులు. నచ్చజెప్పి మళ్లీ భర్త వద్దకు పంపించారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుంది అంజు.
జనవరి 30న అంజు, ఆమె సంజు కలిసి రాత్రి 9 గంటల సమయంలో ప్లాన్ చేశారు. ఆశిష్ రాత్రి భోజనం తర్వాత నడవడం అలవాటు. ఆ విషయం తెలుసుకున్న అంజు.. రోడ్డు మీద నడుచుకుంటూ చాలా దూరం తీసుకెళ్లింది. నిర్మానుష్యమైన ప్రాంతంలో ఈ జంట ఆగిన తర్వాత చెట్లలో దాక్కున్న సంజు, అతడి సహచరులు ఆశిష్‌పై దాడి చేశారు. మొదట కొట్టి ఆపై గొంతు కోసి చంపారు.
అంజు స్వచ్ఛందంగా తన చెవి పోగులు, ఫోన్ నిందితుడికి ఇచ్చింది. అక్కడి నుంచి సంజు గ్యాంగ్ పరారైంది. ఆశిష్-అతని భార్య అంజు అపస్మారక స్థితిలో కనిపించారు. ఆసుపత్రికి వెళ్లేసరికి ఆశిష్ మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం తమను ఢీ కొట్టి బంగారు ఆభరణాలను దోచుకుందని అంజు పోలీసులకు తెలిపింది. దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా మార్చే ప్రయత్నం చేసింది.
ALSO READ: పిల్లలకు మహాత్మాగాంధీ వేషం వేయించి బిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులు అరెస్ట్..?
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆశిష్ బాడీకి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. FSL టీమ్ దర్యాప్తులో రోడ్డు ప్రమాదం జరగలేదని తేలింది. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆగారు. రోడ్డు ప్రమాదంలో ఆశిష్ మరణించినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అతడ్ని కొట్టి, గొంతు కోసి చంపినట్లు తేలింది.
భర్త మరణించినప్పుడు భార్య అంజుకు గాయాలు కాలేదు. నాలుగైదు రోజుల తర్వాత అంజు పదే పదే తన ప్రియుడి సంజుతో మాట్లాడినట్టు తేలింది. దీంతో ఆమెని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో అసలు నిజం బయటపడింది. అంజుతోపాటు ఆమె ప్రేమికుడు సంజు, సహచరులు రోహిత్, సిద్ధార్థ్ లను అరెస్టు చేశారు. ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.