E-Paper
Advertisement

Honda PCX 125 Scooter: హోండా నుంచి ప్రీమియం సిటీ కమ్యూటర్, లాంచింగ్ ఎప్పుడంటే?

Honda PCX 125 Scooter:  హోండా నుంచి ప్రీమియం సిటీ కమ్యూటర్, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Honda PCX 125 Scooter Launch Date: హోండా కంపెనీ నుంచి సరికొత్త బైకులతో పాటు స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే PCX 125 స్కూటర్ వచ్చే నెల(ఫిబ్రవరి 2026)లో విడుదల అయ్యే అవకాశం ఉంది. పవర్ ఫుల్ ఇంజిన్, అత్యాధునిక డిజైన్, మంచి స్టోరేజ్ స్పేస్,TFT డిస్‌ ప్లేతో కూడిన ప్రీమియం సిటీ కమ్యూటర్ గా మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. 12.5 HP పవర్, 11.8 Nm టార్క్ తో పాటు అద్భుతమైన ఫ్యూయల్ ఎకానమీని అందిస్తుంది. ఇది పట్టణ ప్రయాణాలకు, సౌకర్యవంతమైన రైడింగ్ కు అనుగుణంగా ఉంటుంది.

హోండా PCX 125 కీలక అంశాలు 

హోండా PCX 125 ఇంజిన్, పనితీరును పరిశీలించినట్లు అయితే, 125cc, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్ SOHC, eSP+ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 12.5 హార్స్‌ పవర్, 11.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లో 8.1 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఒక లీటర్ పెట్రోల్ తో సుమారు 47.6 కిలో మీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది.

Advertisement

Read Also: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

హోండా PCX 125 ఫీచర్లు

హోండా PCX 125 హోండా రోడ్ సింక్  బ్లూటూత్ కనెక్టివిటీతో 5 అంగుళాల కలర్ TFT స్క్రీన్ ను కలిగి ఉంటుంది. స్మార్ట్ కీ సిస్టమ్ ఉంటుంది. కీ లెస్ ఇగ్నిషన్, సీట్, ఫ్యూయల్ ట్యాంక్ యాక్సెస్ ఉంటుంది. స్టోరేజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సీటు కింద 30.4 లీటర్ల స్పేస్, ఫుల్ ఫేస్ హెల్మెట్ పట్టేంత స్థలం ఉంటుంది. USB ఛార్జింగ్ అవకాశం ఉంటుంది. గ్లోవ్‌ బాక్స్‌ లో USB-C పోర్ట్ ఉంటుంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) ను మెరుగైన ట్రాక్షన్ కోసం ఏర్పాటు చేశారు.

Advertisement

Read Also: లో కాస్ట్, బెస్ట్ మైలేజ్.. హీరో HF డీలక్స్ సూపర్ ఆప్షన్ బ్రో!

మంచి గ్రిప్ కోసం మందమైన టైర్లు

ఇక డిజైన్, సౌకర్యం విషయానికి వస్తే.. 14 అంగుళాల ఫ్రంట్, 13 అంగుళాల రియర్ వీల్స్ ఉంటాయి. గ్రిప్ ఎక్కువగా ఉండేలా వెడల్పు టైర్లు ఉంటాయి. బ్రేకింగ్, సస్పెన్షన్ ను పరిశీలిస్తే, వెనుక డిస్క్ బ్రేక్, డ్యూయల్ షాక్ రియర్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. PCX 125 ప్రత్యేకించి సిటీ ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించడానికి, స్టైలిష్‌గా ఉండటానికి రూపొందించబడింది.  సిటీతో పాటు టౌన్ లలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్ లకు వెళ్లడానికి, రోజువారీ పనులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Read Also: హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R VS హోండా CB 125.. ఏది కొంటే మంచిదంటే?

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×