E-Paper
Advertisement

Hyderabad Traffic Police: వాహనదారులకు అలర్ట్, మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. ఎందుకంటే?

Hyderabad Traffic Police: వాహనదారులకు అలర్ట్, మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. ఎందుకంటే?
Advertisement

హైదరాబాద్  లో ట్రాఫిక్ రూల్స్ కట్టడికి ట్రాఫిక్ పోలీసులు కీలక చర్యలు చేపట్టబోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపబోతున్నారు. ముఖ్యంగా మార్చి 1 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని లక్ష్యంగా చేసుకుని నిరంతర ప్రత్యేక డ్రైవ్‌ లను ప్రారంభించనున్నారు.

ఎందుకు ఈ స్పెషల్ డ్రైవ్ లు?

హైదరాబాద్ లో లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపూ వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అయితే, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరించబడతాయని హెచ్చరించారు. లైసెన్స్ లేని వ్యక్తులను వాహనం నడపడానికి అనుమతించవద్దని వాహన యజమానులకు పోలీసులు సూచించారు.

స్పెషల్ డ్రైవ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే?   

Advertisement

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి పట్టుకునేందుకు మార్చి 1 నుంచి నిరంతరాయంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వాహనదారులు, లైసెన్స్ లేని వ్యక్తులను డ్రైవింగ్ చేయడానికి అనుమతించేవారిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.  ప్రమాదం జరిగితే జరిమానా విధించడంతో పాటు బీమా క్లెయిమ్‌లు తిరస్కరించబడవచ్చన్నారు. దీని వలన తీవ్రమైన చట్టపరమైన, ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ప్రయాణికులు తమ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకెళ్లాలని, రోడ్డు రవాణా అథారిటీ (RTA) నుంచి చెల్లుబాటు అయ్యే డ్రైవిండ్ లైసెన్స్ ను కలిగి ఉండాలన్నారు.

Read Also:  హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, మహబూబ్‌నగర్ సర్వీస్ పొడిగింపు!

ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్పారంటే?  

Advertisement

ఈ తనిఖీలకు సంబంధించి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి జోయెల్ డేవిస్ కీలక విషయాలు వెల్లడించారు.   డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఒకవేళ లేకపోతే తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లతోనే జరుగుతుందని గమనించినట్లు  తెలిపారు. రోడ్డు భద్రత దృష్ట్యా ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, లైసెన్స్ లేని డ్రైవర్ల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి నిర్వహిస్తున్న ఈ డ్రైవ్స్ కు వాహనదారులు సహకరించాలన్నారు.

Read Also: ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బులు లేవా? నో టెన్షన్, హ్యాపీగా ట్రావెల్ చెయ్యొచ్చు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×