E-Paper
Advertisement

Holi Special Trains: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, మహబూబ్‌నగర్ సర్వీస్ పొడిగింపు!

Holi Special Trains: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, మహబూబ్‌నగర్ సర్వీస్ పొడిగింపు!
Advertisement

Holi Special Trains Announced: హోలీ సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. పీక్ ట్రావెల్ సీజన్‌ లో అదనపు సౌకర్యాన్ని అందించనున్నాయి.  పశ్చిమ రైల్వే (WR) తాజాగా కీలక మార్గాల్లో ప్రత్యేక ఛార్జీలతో ఆరు జతల స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదే సమయంలో రాజ్‌ కోట్-మహబూబ్‌ నగర్ వీక్లీ స్పెషల్ రైలును పొడిగించింది.

పశ్చిమ రైల్వే ప్రకటించిన హోలీ స్పెషల్ రైళ్లు

⦿ ముంబై సెంట్రల్ – కత్గోడం సూపర్‌ ఫాస్ట్ వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు): ఇది ఫిబ్రవరి 25, మార్చి 26 మధ్య ముంబై-ఉత్తరాఖండ్‌ ను కలుపుతూ సేవలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

⦿ ముంబై సెంట్రల్ – కాన్పూర్ అన్వర్‌ గంజ్ సూపర్‌ఫాస్ట్ వీక్లీ స్పెషల్ (12 ట్రిప్పులు): ఈ రైలు ఫిబ్రవరి 22, మార్చి 30 మధ్య ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని కీలక నగరాలను కలుపుతూ ఈ సర్వీసులు కొనసాగుతాయి.

⦿ బాంద్రా టెర్మినస్ – పాలిటానా వీక్లీ స్పెషల్ (2 ట్రిప్పులు): ఫిబ్రవరి చివరిలో గుజరాత్‌కు ప్రయాణించే ప్రయాణీకులకు ప్రత్యేక సర్వీస్ నడుస్తుంది.

Advertisement

⦿ ఉధ్నా – మాల్దా టౌన్ వీక్లీ స్పెషల్ (8 ట్రిప్పులు): ఈ సర్వీస్ ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్య గుజరాత్‌ను తూర్పు భారతంతో కలుపుతుంది.

⦿ సబర్మతి – హరిద్వార్ వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు): ఫిబ్రవరి 23, మార్చి 24 మధ్య షెడ్యూల్ చేయబడిన ఈ రైలు రాజస్థాన్, ఢిల్లీ మీదుగా ఉత్తరాఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

⦿ ఇండోర్ – హజ్రత్ నిజాముద్దీన్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (20 ట్రిప్పులు): ఫిబ్రవరి 22 నుంచి మార్చి 28 వరకు నడుస్తున్న ఈ రైలు మధ్యప్రదేశ్, ఢిల్లీ మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.

రాజ్‌కోట్-మహబూబ్‌నగర్ స్పెషల్ పొడిగింపు

పశ్చిమ రైల్వే రైలు నంబర్ 09575/09576 రాజ్‌కోట్-మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్‌ను మార్చి 30, 31 వరకు పొడిగించింది. ఈ మార్గంలో ప్రయాణీకులకుఉపశమనం కలిగించనుంది.

రాజ్‌కోట్-మహబూబ్‌నగర్ స్పెషల్ బుకింగ్ వివరాలు

రాజ్‌కోట్-మహబూబ్‌నగర్ స్పెషల్ బుకింగ్ ఫిబ్రవరి 21, 2026 నుంచి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్ఎస్) కౌంటర్లలో, ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయి.

Read Also:  రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్ పని చేయడదట!

ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలన్న రైల్వే అధికారులు

హోలీ సందర్భంగా తీసుకొస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇబ్బందులు లేని ప్రయాణాల కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ రైళ్లకు సంబంధించి ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు.

Read Also: ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!

Related News

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

Big Stories

Advertisement
×