E-Paper
Advertisement

Fly Now, Pay Later: ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బులు లేవా? నో టెన్షన్, హ్యాపీగా ట్రావెల్ చెయ్యొచ్చు!

Fly Now, Pay Later: ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బులు లేవా? నో టెన్షన్, హ్యాపీగా ట్రావెల్ చెయ్యొచ్చు!
Advertisement

Fly Now, Pay Later Payment Option: ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్ వేస్ ప్రయాణీకులకు మెరుగైన ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించేందుకు సరికొత్త స్కీమ్ ము పరిచయం చేసింది. ‘ఫ్లై నౌ, పే లేటర్(BNPL)’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఇలాంటి విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి కువైట్ ఎయిర్‌ లైన్‌ గా అవతరించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రయాణీకులు విమాన టికెట్లను ఒకేసారి డబ్బులు పే చేసి బుక్ చేసుకునేలా కాకుండా, వాయిదాల పద్దతిలో చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఫిబ్రవరి 21న ఈ కొత్త స్కీమ్ ను అందుబాటులో తీసుకొచ్చింది.

రెండు నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లింపులు

కొత్త స్కీమ్ ద్వారా ఎయిర్‌ లైన్ వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయాణికులు మొత్తం టికెట్ డబ్బులను రెండు నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ డబ్బులను కువైట్ దినార్ లో చెల్లించాల్సి ఉంటుంది. డీమా ద్వారా ఎయిర్‌ లైన్ పూర్తి చెల్లింపును ముందస్తుగా అందుకుంటుంది. ఆ తర్వాత డీమా కస్టమర్ కలెక్షన్‌ను మేనేజ్ చేస్తుంది.

ప్రయాణీకులకు ఎందుకు మేలు అంటే?

Advertisement

BNPL స్కీమ్ అనేది ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  విమాన ప్రయాణానికి సంబంధించి ముందస్తు ఖర్చు చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా కుటుంబాలు, విద్యార్థులు, తక్కువ ఆదాయ వేతనం ఉన్నవాళ్లకు కష్టంగా ఉంటుంది. వాయిదా పద్దతుల్లో చెల్లింపులను చేయడం వల్ల ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వీలును బట్టి రెండు నుంచి నాలుగు వాయిదాల్లో డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక భారం తగ్గుతుంది.

విమానయానంలో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్

కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, టెక్ అవగాహన ఉన్న ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ వ్యూహంలో భాగంగా BNPL విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు జజీరా ఎయిర్‌ వేస్ అధికారులు వెల్లడించారు.  డీమా లాంటి స్థానిక ఫిన్‌ టెక్ తో కలిసి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించబోతున్నట్లు తెలిపారు. ప్రయాణ అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జజీరా ఎయిర్‌ వేస్ CEO బరథన్ పసుపతి తెలిపారు.

Advertisement

Read Also: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్ పని చేయడదట!

విమాన రంగంలో నయా జోష్  

విమాన రంగం కరోనా మహమ్మారి తర్వాత అనుకున్న ఊపు తగ్గింది. చాలా సంస్థలు ఆర్థిక ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జజీరా తీసుకొచ్చిన BNPL ద్వారా మళ్లీ విమాన ప్రయాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే బాటలో ఇతర విమాన సంస్థలు కూడా ప్రయాణిస్తే, మళ్లీ విమాన రంగం గాడిలో పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, మహబూబ్‌నగర్ సర్వీస్ పొడిగింపు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×