E-Paper
Advertisement

Konkan Railway: రైల్వేలో ఇంజనీరింగ్ శిక్షణకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఆధారంగానే జాబ్

Konkan Railway: రైల్వేలో ఇంజనీరింగ్ శిక్షణకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఆధారంగానే జాబ్
Advertisement

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) అప్రెంటిస్ చట్టం 1961/1973 కింద వివిధ విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 గ్రాడ్యుయేట్ స్థాయి అలాగే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతకు రైల్వే రంగంలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇదొక చక్కని వేదికగా నిలుస్తుంది.

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 2021 నుండి 2025 మధ్య కాలంలో సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడం ప్రాథమిక నిబంధనగా ఉంది.

2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు అలాగే ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వర్గాలకు 3 ఏళ్ల వయో సడలింపు లభిస్తుంది.

Advertisement

స్టైఫండ్:

స్టైపెండ్ వివరాలు పరిశీలిస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 9,000 చెల్లిస్తారు. డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ. 8,000 అందుతుంది. ఈ మొత్తంలో 50 శాతం నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో జమ చేస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ పూర్తిగా అకడమిక్ మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ భూములను కోల్పోయిన కుటుంబాల అభ్యర్థులకు ఎంపికలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు.

ఆసక్తి గల వారు కొంకణ్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://konkanrailway.com/

దరఖాస్తు ఫీజు:

జనరల్ అలాగే ఓబీసీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులతో పాటు మైనారిటీలు ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ 21 మార్చి 2026 వరకు అవకాశం ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవడం బెటర్ అని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 21

ALSO READ: NPCIL Recruitment: నో ఎగ్జామ్.. అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తది, NPCILలో భారీగా ఉద్యోగాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×