E-Paper
Advertisement

Ind vs Sa 3rd Odi: 20 వేల మైలురాయిలో రోహిత్ శ‌ర్మ‌, యశస్వి జైస్వాల్ సెంచ‌రీ

Ind vs Sa 3rd Odi: 20 వేల మైలురాయిలో రోహిత్ శ‌ర్మ‌, యశస్వి జైస్వాల్ సెంచ‌రీ
Advertisement

Ind vs Sa 3rd Odi: టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI) మ‌ధ్య జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో య‌శ‌స్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. మొద‌టి, రెండు వ‌న్డేల్లో అట్ట‌ర్ ఫ్లాప్ అయిన య‌శ‌స్వి జైస్వాల్, విశాఖ‌లో అద‌ర‌గొట్టాడు. ఈ మ్యాచ్ లో సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 112 బంతుల్లో సెంచ‌రీ కొట్టేశాడు య‌శ‌స్వి జైస్వాల్. దక్షిణాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడారు. ఇందులో భాగంగానే యశస్వి జైస్వాల్ తన సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ 10 బౌండరీలతో పాటు ఒక సిక్సర్ కొట్టాడు. మొదటి 50 పరుగులు 76 బంతుల్లో పూర్తి చేసిన యశస్వి జైస్వాల్, మరో 50 పరుగులు 36 బంతులను ఫినిష్ చేశాడు. దీంతో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచ‌రీతో అన్ని ఫార్మాట్స్ లో సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్ గా రికార్డ్ సృష్టించాడు య‌శ‌స్వి జైశ్వాల్‌. అటు రోహిత్ శర్మ సెంచరీ మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

20 వేల మైలురాయిలో రోహిత్ శ‌ర్మ‌

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa, 3rd ODI) మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో భారత ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డేలో ఒక సిక్స్ అలాగే ఆరు బౌండరీలతో 54 బంతుల్లోనే అర్థ సెంచ‌రీ నమోదు చేసుకున్నాడు రోహిత్ శర్మ. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు నమోదు చేసిన నాలుగవ టీమిండియా ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 34 వేలకు పైగా పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 27 వేలకు పైగా పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 24 వేలకు పైగా పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఈ ముగ్గురు మూడు స్థానాల్లో ఉండగా రోహిత్ శర్మ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తాడనుకున్న రోహిత్ శర్మ, 75 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో మన టీమిండియా జట్టు మొదటిసారిగా టాస్‌ గెలిచింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెకండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోరే చేసింది. 47.5 ఓవర్లలో 271 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది దక్షిణాఫ్రికా. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆచితూచి ఆడుతోంది టీమిండియా. దాదాపు విజయ తీరాలకు చేరిన టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?

 

 

 

 

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×