Volkswagen Golf GTI: జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ కు చెందిన గోల్ఫ్ GTI ICOTY 2026లో సత్తా చాటింది. పలు హైఎండ్ కార్లను వెనక్కి నెట్టి, ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. ఈ ఐకానిక్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్ బ్యాక్ డ్రైవింగ్ డైనమిక్స్, ప్రాక్టికాలిటీ, రోజువారీ వినియోగం లాంటి అంశాలతో జ్యూరీని ఆకట్టుకుంది. షార్ట్ లిస్ట్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.
గోల్ఫ్ GTI కారు.. BMW iX1 LWB, BMW X3, మెర్సిడెస్ బెంజ్ G-క్లాస్, MG సైబర్ స్టర్, స్కోడా కోడియాక్, స్కోడా ఆక్టేవియా RS, టయోటా కామ్రీలతో సహా పలు పోటీ కార్లను కాదని జ్యూరీ మెంబర్స్ ను ఆకట్టుకుంది. సరదాగా డ్రైవ్ చేయగలిగే ఈ కారు, ప్రీమియం విభాగంలోనూ సత్తా చాటింది. అద్భుతమైన పనితీరు, నిర్మాణ నాణ్యత, ఆవిష్కరణ, భద్రతా ఫీచర్లు, సౌకర్యం, కాస్ట్, లగ్జరీ లాంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కారును అవార్డుకు ఎంపిక చేశారు.భారత్‌లో 2025లో లాంచ్ అయిన ఈ హాట్ హ్యాచ్ ధర సుమారు రూ.50-53 లక్షలు.
ICOTY అవార్డులకు సంబంధించిన జ్యూరీలో ప్రముఖ ఆటోమోటివ్ జర్నలిస్టులు, టెక్ నిపుణులు ఉన్నారు. అన్ని అంశాలకు సంబంధించి డైనమిక్, స్టాటిక్ వివరాలను సేకరించి పోటీలో పాల్గొన్న ప్రతి కారుకు స్కోర్ ఇస్తారు. చివరగా ఎక్కువ స్కోర్ సాధించిన కారుకు అవార్డుకు ఎంపిక చేస్తారు. 2026 అవార్డులకు గాను ICOTY జ్యూరీలో కార్ వాలే నుంచి విక్రాంత్ సింగ్-సాగర్ భానుశాలి, ఆటోఎక్స్ నుంచి ధృవ్ బెహ్ల్- ఇషాన్ రాఘవ, ఆటో టుడే నుంచి యోగేంద్ర ప్రతాప్- దిపాయన్ దత్తా, కార్ ఇండియా నుంచి ఆస్పి భతేనా- గౌరవ్ దావరే, కార్ ఇండియా నుంచి శిరీష్ చంద్రన్- ఆతిష్ ఇండియా మిశ్రా, ఓవర్ డ్రైవ్ నుంచి రోహిత్ పరాడ్కర్- క్రాంతి సంభవ్, TOI ఆటో నుంచి అర్పిత్ మహేంద్ర, కార్ దేఖో నుంచి తుషార్ కామత్, ది ప్రింట్ నుంచి కుషన్ మిత్ర ఉన్నారు.
Read Also: బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!
వోక్స్ వ్యాగన్ అనేది జర్మనీకి చెందిన పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ. ఇది ఆడి, పోర్షే, స్కోడా, బెంట్లీ లాంటి పలు బ్రాండ్‌లను కలిగి ఉన్నది. మన దేశంలో ఇది వోక్స్ వ్యాగన్ విర్టస్ (Virtus), టైగున్ (Taigun), టిగువాన్ (Tiguan), గోల్ఫ్ GTI, ఎలక్ట్రిక్ ID.4.లాంటి మోడళ్లను విక్రయిస్తుంది. పూణేలో ఉత్పత్తి కేంద్రం ఉంది. వోక్స్ వ్యాగన్ నాణ్యత, ఇంజనీరింగ్ వైవిధ్యంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా యూరప్ లో అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటిగా కొనసాగుతోంది.
Read Also: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ రేంజ్.. టాటా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక అసలు కథ ఇదే!