ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం, బనకచర్ల నిర్మాణంతో సహా.. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు INTUC ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్‌లో 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. లొంగిపోయిన వారి నుంచి భారీగా ఏకే 47, ఇన్సాస్, SLR తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నందమూరి తారక రామారావు వీరాభిమాని రామచంద్రరాజు అంత్యక్రియలు ముగిశాయి. తిరుమల కానుకమాను వద్ద ఉన్న స్మశాన వాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మోహనకృష్ణ, రామకృష్ణ ఆయన పాడె మోసి వారి అభిమానం చూపించారు. టీడీపీ నేతలు పలువురు నివాళులర్పించారు.
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరో భారీ మోసం చోటుచేసుకుంది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ కేసులో ఈడీ అధికారులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పని వేళల్లో కలెక్టర్ కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు పాఠశాలల సమయాలను సవరించి.. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మారుస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో అర్ధరాత్రి దొంగ హల్చల్ చేశాడు. డొంక రోడ్డులోని నాలుగు ఇళ్లల్లో చోరీకి యత్నించి విఫలం అయ్యాడు. ఓ ఫ్లాట్‌లో సెల్‌ఫోన్ తీసుకుంటుండగా అలికిడి కావడంతో పరారయ్యాడు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం తప్పింది. బ్యాటరీ -1 వద్ద కార్ పుషింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. జీసీఎం వద్ద పడి ఉన్న వేస్ట్ ఆయిల్‌కు మంటలు అంటున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది, కార్మికులు మంటలను ఆర్పేశారు.
ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా సాగుతున్న గంజాయి దందాకు మాదాపూర్ SOT పోలీసులు చెక్ పెట్టారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కిలోల గంజాయితో పాటు 2 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సిద్ధిపేట శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. అతి వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే లారీ, బస్సు డ్రైవర్లు సకాలంలో బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది.
శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లిలో పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ధనంజయ అలియాస్ మహమ్మద్ అసిఫ్‌ను కదిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రేమ కోసం ఇస్లాంలోకి మారి…తన పేరును మహమ్మద్ అసిఫ్‌గా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం తన మతాన్ని మార్చుకున్నాడు నిందితుడు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. 9వ తరగతి విద్యార్థులపై ఇంటర్ మెుదటి సంవత్సరం స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటనలో 9వ తరగతి విద్యార్థి దీపక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో.. హుటాహుటిన దీపక్‌ను ఇతర విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు.
పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన ఘటనపై యువతి స్పందించింది. తానేమీ తప్పుగా చేయలేదని.. ఆలయం బయటే వీడియో చేశానంటూ వివరణ ఇచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లోనే వీడియో చేశానంటూ క్లారిటీ ఇచ్చింది. తానేమైనా తప్పు చేస్తే క్షమించాలంటూ వేడుకుంది.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే గండిపేట జలాశయంలోకి వ్యర్థాలను వదిలిన ఘటనపై పోలీసులు స్పందించారు. ఉస్మాన్ సాగర్‌లో వ్యర్థాలను వదిలిన సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ శివ, ఓనర్ రాములుపై కేసు నమోదు అయింది. ప్రజా నీటి వనరులను కలుషితం చేయడం పట్ల వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పీఎస్ పరిధిలోని భూపాల్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరుగుపొరుగు వారు చెప్పడంతో తల్లి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది. అయితే.. ఓ యువకుడు తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది.
పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తులు సమర్పించే కానుకల లెక్కింపులో పూర్తి పారదర్శకత ఉండాలని ఆదేశించింది. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలంది. ఈ విషయంలో పూర్తి బాధ్యత టీటీడీదేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
అక్రమ వలసలు, ఎనిమిది యుద్ధాలను నిలువరించడంలో తాను విజయం సాధించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టారిఫ్స్ వలనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, గత ప్రభుత్వం సృష్టించిన అస్తవ్యస్త స్థితిని 11 నెలల్లో చక్కదిద్దానని తెలిపారు. వలసదారులను వెనక్కి పంపడం, ఉపాధి కల్పన, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం వంటి అంశాలను తన విజయాల జాబితాలో చేర్చారు.
యూఏఈని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి నుంచి దుబాయ్, అబుదాబీ, షార్జా, రాస్ అల్ ఖైమా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా రోడ్ల నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
రాజాసాబ్ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌ను అనుమతి లేకుండా నిర్వహించారంటూ నిర్వాహకులు, లూలు మాల్ యాజమాన్యం, శ్రేయస్ మీడియాపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు ఈవెంట్‌కు అనుమతి తీసుకోనందుకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
2026 నూతన సంవత్సరంలోకి స్పష్టమైన లక్ష్యాలతో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు ప్రముఖ నటి సమంత. కొత్త ఏడాదికి సంబంధించిన తన తీర్మానాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జీవితంలో వేగం తగ్గించి.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో లోతైన, అర్థవంతమైన బంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు సమంత.