E-Paper
Advertisement

Mahindra XEV 9S: మహీంద్రా కీలక నిర్ణయం, XEV 9S ఎలక్ట్రిక్ SUVలో కొత్త డ్రైవ్ మోడ్‌!

Mahindra XEV 9S: మహీంద్రా కీలక నిర్ణయం,  XEV 9S ఎలక్ట్రిక్ SUVలో కొత్త డ్రైవ్ మోడ్‌!
Advertisement

Mahindra XEV 9S New Drive Mode: వినియోగదారులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్కెట్ లోకి వచ్చిన ఎలక్ట్రిక్ SUVలో సస్పెన్షన్ కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పలు మీడియా సంస్థలు ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకోసం సదరు కారులో కొత్త డ్రైవ్ మోడ్ ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ఆ కార్లలో ఎలాంటి సమస్య ఉండదని ప్రకటించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ SUVలో సస్పెన్షన్ సెట్టింగ్‌లకు సంబంధించి మీడియా ఫీడ్ బ్యాక్ కు ప్రతిస్పందనగా మహీంద్రా కొత్త డ్రైవ్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. పలువురు ఆటో జర్నలిస్టులు ఈ కారు డ్రైవ్ రివ్యూలో భాగంగా ప్యాక్ త్రీ ట్రిమ్ అడాప్టివ్ సస్పెన్షన్ స్మూత్ నెస్ ను హైలైట్ చేశారు. సున్నితంగా ఉండాల్సిన టార్మాక్‌ లో, సస్పెన్షన్ సమస్యల కారణంగా కారు వణుకుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. కారు వేగం పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతున్నట్లు తెలిపారు. రేస్ మోడ్‌ లో దృఢమైన డంపింగ్ దీనిని తగ్గిస్తుందన్నారు. నిలువుగా బాడీ కదలికను బాగా నియంత్రిస్తుందన్నారు.

సమస్య పరిష్కారం కోసం కొత్తగా కస్టమ్ డ్రైవ్ మోడ్‌

Advertisement

మహీంద్రా పవర్‌ ట్రెయిన్, స్టీరింగ్, సస్పెన్షన్, క్లైమేట్ సిస్టమ్ కోసం ఇండివిడ్యువల్ సెట్టింగ్స్ను అనుమతించే కొత్త కస్టమ్ డ్రైవ్ మోడ్‌ ను తీసుకొచ్చింది. ఈ మోడ్ కారణంగా డ్రైవర్లు గతంలో ఎదుర్కొన్న సమస్యను నివారించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పుడు పవర్‌ ట్రెయిన్, స్టీరింగ్‌ ను రిలాక్స్డ్ కంఫర్ట్ మోడ్‌ లో సస్పెన్షన్‌ ను దృఢమైన రేస్ మోడ్‌ లో ఉంచడం సాధ్యమవుతుంది.

Read Also: BKT నుంచి సరికొత్త టూవీలర్ టైర్లు లాంచ్, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisement

ఇక ఈ కారుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ టెస్ట్ ప్యాకేజీలో భాగమైన డిఫాల్ట్, ఎవ్రీడే, రేంజ్, రేస్ మోడ్‌ లకు అదనంగా కొత్త కస్టమ్ మోడ్ అందుబాటులోకి వచ్చింది.  ఈ అప్‌ డేట్ అడాప్టివ్ డంపర్లను ఉపయోగించే XEV 9S ప్యాక్ త్రీ ట్రిమ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. పాసివ్ డంపింగ్‌ ను ఉపయోగించే ప్యాక్ వన్, ప్యాక్ టూలో లేదని తెలిపింది. కొత్త డ్రైవ్ మోడ్ అనేది ప్రొడక్షన్ మోడల్‌ లో రానున్నట్లు తెలిపింది. కొత్త మోడల్ కారుకు సంబంధించి కస్టమర్ డెలివరీలు జనవరి 26న ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సమస్యకు కొత్త మోడ్ తో పరిష్కారం చూపించనున్నట్లు మహీంద్రా కంపెనీ ప్రకటించింది.

Read Also: కొత్త దేశీ కారు బ్రాండ్ వచ్చేస్తోంది, అట్టహాసంగా JSW మోటార్స్ అనౌన్స్ మెంట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×